NBK 111 Story Leaked: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రం గానే జరిగాయి. ఈ సినిమా హిట్ అవుతుందా?, లేదా ఫ్లాప్ అవుతుందా? అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే , ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో అలాంటి మాస్ సినిమా వస్తుందని ఆశిస్తే, హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమా వస్తుందని పూజా కార్యక్రమాలు జరిగిన రోజే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్.
అయితే ఇది గౌతమి పుత్ర శాతకర్ణి తరహా సినిమా అయితే కాదట. ‘అనార్కలి’ తరహా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. బాలయ్య తో ఈ వయస్సులో ‘అనార్కలి’ తరహా లవ్ స్టోరీ అంటే, అసలు ఏ యాంగిల్ లో వర్కౌట్ అవుతుంది అనుకొని ఈ చిత్రాన్ని బాలయ్య తో తియ్యాలని అనుకున్నాడో అని సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార నటించబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం అధికారిక ప్రకటన కూడా చేసింది. కానీ ఏ యాంగిల్ లో చూసినా బాలయ్య తో లవ్ స్టోరీ అంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం మంచి ఇంటెన్సిటీ ఉన్న పవర్ ఫుల్ స్టోరీ తో వస్తేనే, బాలయ్య లుక్స్ పై అనేక ట్రోల్స్ పడ్డాయి.
ఈ సినిమాకు అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది, కానీ ఆ టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రాలేదు. అందుకు ముఖ్య కారణం వయస్సు కి తగ్గ పాత్ర చేయకపోవడమే. అప్పట్లో ఆ చిత్రాన్ని చాలా మీడియం రేంజ్ బడ్జెట్ లోనే పూర్తి చేశారు. కానీ ఈసారి మాత్రం 250 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తీస్తున్నారట. బాలయ్య కి అంత మార్కెట్ ప్రస్తుతానికి లేదు. తెలుగు లో ఆయన సినిమా సూపర్ హిట్ అయితే 100 కోట్ల షేర్ వసూళ్లు రావడమే ఎక్కువ. అలాంటిది ఏకంగా 250 కోట్ల బడ్జెట్ అంటే, కచ్చితంగా అంతకు మించిన షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఆ రేంజ్ వసూళ్లు నేటి తరం స్టార్ హీరోలకు కూడా అతి కష్టం మీద వస్తున్నాయి. ఇక బాలయ్య లాంటి సీనియర్ హీరోలకు ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.