Homeఎంటర్టైన్మెంట్Ram Charan- Upasana Assets: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా?... మీ...

Ram Charan- Upasana Assets: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా?… మీ ఊహకు కూడా అందదు!

Ram Charan- Upasana Assets: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా రామ్ చరణ్ – ఉపాసన ఉన్నారు. కేవలం స్టార్ హీరో వైఫ్ గానే కాకుండా ఉపాసన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కలిగి ఉన్నారు. ఆమె మహిళా వ్యాపారవేత్త, సోషల్ ఆక్టివిస్ట్. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టిపిఏ లిమిటెడ్ డైరెక్టర్ కూడాను. బి పాజిటివ్ పేరుతో ఓ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా నడుపుతున్నారు. ఉపాసన అనేక నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఉపాసన పేరిట ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. టాలీవుడ్ హీరోల భార్యలలో ఉపాసన అందరి కంటే చాలా రిచ్.

Ram Charan- Upasana Assets
Ram Charan- Upasana

ఉపాసన దోమకొండ సంస్థానం వారసురాలు.కామినేని ప్రతాప్ రెడ్డి మనవరాలు, అనిల్ కుమార్ కూతురు. అపోలో గ్రూప్ వాటాదారు కూడాను. ఒక అంచనా ప్రకారం ఉపాసన వాటా విలువ 8 నుండి 10 వేల కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక స్థిర, చర ఆస్తుల రూపంలో వందల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల ఆస్తులు మొత్తం కలిపినా ఉపాసనకు ఉన్న సంపదకు సమానం కాదు.

అంత సంపద ఉన్నా ఉపాసన చాలా నిరాడంబరంగా ఉంటారు. రిలేషన్స్ కి బాగా విలువ ఇస్తారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ అంటే అమితమైన గౌరవం కనబరుస్తారు. మెగా అభిమానులు ఆమె ప్రవర్తనను చాలా ఇష్టపడతారు. వదినమ్మ అని పిలుచుకుంటారు. అదే సమయంలో ఉపాసన మెగా వారసుడికి జన్మనివ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈమేరకు రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్ష తెలియజేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలలో కూడా ఉపాసనకు ఈ ప్రశ్న ఎదురవుతుంది.

Ram Charan- Upasana Assets
Ram Charan- Upasana

పెళ్ళై పదేళ్లు కావస్తున్నా ఎందుకు పిల్లలు కనలేదని ఆమెను అడుగుతున్నారు. జీవితంలో పిల్లలు కనడం కంటే ముఖ్యమైన విషయాలు అనేకం ఉన్నాయి. ఇంత కంటే నేను ఏమి మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారని ఉపాసన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఈ ఏడాది 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికోసం విదేశాలకు చెక్కేశారు. అదే సమయంలో ప్రొఫెషనల్ గా ఇద్దరూ చాలా బిజీ. ఇటీవల సిస్టర్స్ తో రామ్ చరణ్ టూర్ వెళ్ళాడు. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఉపాసన ఆ ట్రిప్ మిస్ అయ్యారు. దానికి ఆమె ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version