Nayanthara- Vignesh Honeymoon: లాంగ్ టర్మ్ లవ్ బర్డ్స్ నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు. జూన్ 19న మహాబలిపురంలో వీరి వివాహం జరిగింది. నయనతార, విగ్నేష్ వివాహానికి షారుఖ్ ఖాన్, అమితాబ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా రావడం విశేషం. ఇక నయనతార క్రిస్టియన్ కావడంతో వాళ్ళ సాంప్రదాయంలో కూడా పెళ్లి జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలా జరగలేదు. హిందూ వివాహ పద్దతిలో మాత్రమే పెళ్లి జరిగింది. ఇక సెలబ్రిటీ కపుల్ కాబట్టి అన్ని విషయాలు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలో హనీమూన్ కోసం అందమైన దీవుల దేశం చెక్కేశారట. నయనతార, విగ్నేష్ హనీమూన్ జరుపుకోవడానికి థాయిలాండ్ వెళ్లారట. అక్కడే రెండు వారాలకు పైగా ఏకాంతంగా సాగరతీరంలో ఎంజాయ్ చేయనున్నారట. వినోదాలకు, విహారాలకు, సరదాలకు థాయిలాండ్ పెట్టింది పేరు. అందుకే జీవితంలో మధుర క్షణాలు జరుపుకోవడానికి థాయిలాండ్ వెళ్లారు. ఆ దేశంలోని అందమైన ప్రదేశాలలో ఈ జంట విహరించనున్నారట.
Also Read: Chandrababu-NTR Family: ఏకతాటిపై ఎన్టీఆర్ కుటుంబం.. ఆ ఒక్కరు తప్ప.. చంద్రబాబు భారీ స్కెచ్
కాగా ఆనందంగా పెళ్లి చేసుకున్న నయనతార, విగ్నేష్ అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజు నవదంపతులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం గుడి పరిసరాలలో నయనతార, విగ్నేష్ ఫోటోలు దిగారు. అప్పుడు నయనతార చెప్పులు ధరించడం వివాదమైంది. విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ చర్యలకు సిద్ధమైంది. అయితే నయనతార జరిగిన పొరపాటుకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది.

2015లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ షూటింగ్ సమయంలో నయనతార, విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఆ చిత్ర దర్శకుడు విగ్నేష్ కాగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుండి గత ఏడేళ్లుగా నయనతార, విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడేళ్ల కాలంలో భార్య భర్తల మాదిరి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చివరకు ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ఇక కెరీర్ బిగినింగ్ లో నయనతార హీరో శింబు తర్వాత ప్రభుదేవా ప్రేమించారు. అనుకోని కారణాలతో వారి నుండి విడిపోయారు.
Also Read:Pawan Kalyan- Actor Nandu: పవన్ పై యంగ్ హీరో హాట్ కామెంట్..: పొత్తు వారితోనే అంటూ..