https://oktelugu.com/

Nayanthara : 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను అంటూ నయనతార షాకింగ్ కామెంట్స్..ఇంత పగ ఎందుకు?

Nayanthara : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ వింటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార(Nayanathara). మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈమె 'గజినీ' చిత్రం ద్వారా పరిచయమైంది.

Written By: , Updated On : February 28, 2025 / 05:26 PM IST
Nayanthara

Nayanthara

Follow us on

Nayanthara : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ వింటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార(Nayanathara). మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈమె ‘గజినీ’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘చంద్రముఖి’ సినిమాతో మన తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), ప్రభాస్(Rebel Star Prabhas) వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన నయనతార, కోలీవుడ్ లో అందరి స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కేరళలో పుట్టి పెరిగినప్పటికీ, తమిళ ఇండస్ట్రీ లో స్థిరపడింది నయనతార. కేవలం తమిళం కి మాత్రమే పరిమితం కాకుండా, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Also Read : మాజీ ప్రియుడు శింబు తో నయనతార..హీరో ధనుష్ కి చెక్..ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా!

ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు నయనతార కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవలే సతీష్ విగ్నేష్ అనే తమిళ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార, పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది. అయితే నయనతార స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తనకు నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అయినా నటించడానికి ఇష్టపడడు. అంతే కాకుండా ఆమె సినిమా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనడం చాలా అరుదు. ఒక సినిమాకి సంతకం చేసే ముందే ఆమె ప్రొమోషన్స్ లో పాల్గొనబోనని ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఎన్నో దశాబ్దాల నుండి ఆమె ఇదే అనుసరిస్తూ ముందుకు పోతుంది. కొంతమంది హీరోయిన్లు భారీ పారితోషికం ఇస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధమవుతారు, కానీ నయనతార అలాంటి హీరోయిన్ కాదు.

ఉదాహరణకు శరవణన్ అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ‘ది లెజెండ్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర కోసం నయనతార ని సంప్రదించాడట శరవణన్. తమిళ సీనియర్ జర్నలిస్ట్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నయనతార గారి ఇంటి ముందు అప్పుడప్పుడు రోల్స్ రాయిస్ కారు ఉండేది, ఎవరిదీ ఈ కారు అని అనుకునేవాడిని. అదే కారుని నేను ఒక పెళ్ళిలో చూసాను, ఆ కారు శరవణన్ గారిది. అప్పుడు అర్థమైంది తన సినిమాలో నటించమని ఆయన నయనతార ని కలిసి అనేకసార్లు అడిగాడని, కావాలంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోమని ఆఫర్ చేసాడట. కానీ ఆమె వంద కోట్లు ఇచ్చినా నటించను అని ముఖం మీదనే చెప్పేడట. ఆ తర్వాత ఆ క్యారక్టర్ ని బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తో చేయించారు. ఈ చిత్రంలోని పాటలు,ఊర్వశి రౌతేలా క్యారక్టర్ చూస్తే అర్థం అవుతుంది, నయనతార ఎందుకు ఈ క్యారక్టర్ ని రిజెక్ట్ చేసింది అనేది.

Also Read : నయనతార కి కోలుకోలేని షాక్ ఇచ్చిన హై కోర్టు..హీరో ధనుష్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదుగా!