Nayanthara
Nayanthara: ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) గతంలో తమిళ హీరో శింబు(Silambaresan) తో ప్రేమాయణం నడిపింది అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి 2006 వ సంవత్సరంలో విడుదలైన ‘వల్లభ’ చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అనేక సంవత్సరాలు వీళ్లిద్దరు కలిసి ఎన్నో ప్రైవేట్ పార్టీలలో తిరిగారు. అధికారికంగా మేము ప్రేమించుకుంటున్నాము అనే విషయం చెప్పకపోయినా, అనధికారికంగా మేము రిలేషన్ లో ఉన్నామని చెప్పకనే చెప్పారు. వీళ్ళ రిలేషన్ సజావుగా సాగుతున్న సమయం, వీళ్ళు ప్రైవేట్ కలిసి రొమాన్స్ చేసుకున్న ఫోటోలు మీడియా కి లీక్ అయ్యాయి. దీంతో నయనతార ఆగ్రహించి శింబు తో గొడవలు పెట్టుకుంది. అక్కడితో వీళ్లిద్దరి ప్రేమకు బ్రేకప్ పడింది. ప్రేమికులు గా విడిపోయినప్పటికీ, వీళ్ళు మళ్ళీ 2016 వ సంవత్సరం లో కలిసి ఒక సినిమా చేసారు.
చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేసారు కాబట్టి, వీళ్ళు మళ్ళీ ప్యాచప్ అయిపోయారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదని ఆ తర్వాత తెలిసింది. ఒక ఈవెంట్ లో ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడినప్పటికీ పలకరించుకోలేదు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మళ్ళీ వీళ్ళు చాలా కాలం తర్వాత ఒకే వేదికని పంచుకోబోతున్నారని సోషల్ మీడియా లో ఇప్పుడు వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘లవ్ టుడే’ హీరో/ దర్శకుడు లేటెస్ట్ గా హీరోగా చేసిన చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా లో హీరో శింబు ఒక పాట పాడాడు. ఆ పాట తమిళనాట పెద్ద హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాలని మూవీ టీం నుండి ఆహ్వానం అందింది. అందుకు శింబు ఒప్పుకున్నట్టు సమాచారం. శింబు తో పాటు హీరోయిన్ నయనతార కి కూడా ఆహ్వానం అందిందట.
ఎందుకంటే ఆమె ప్రదీప్ రంగనాథన్ ని హీరో గా పెట్టి ‘LIC’ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆమెతో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈవెంట్ కి ఆహ్వానించాడట. అందుకు ఆమె కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అలా చాలా కాలం తర్వాత వీళ్లిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. అయితే ప్రస్తుతం ధనుష్, నయనతార మధ్య కాపీ రైట్ వివాదం తారాస్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. శింబు, ధనుష్ కోలీవుడ్ లో భద్ర శత్రువులు అనేది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ధనుష్ కి శత్రువులుగా మారిన ఈ ఇద్దరు ఇప్పుడు కలవబోతుండడంతో ఏదైనా అతనికి విరుద్ధంగా ప్లాన్ చేయబోతున్నారా అనే సందేహాలను ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి శింబు, నయనతార ఈ ఈవెంట్ లో మాట్లాడుకుంటారా లేదా అనేది.