Dhanush-Nayanthara
Nayanthara : నయనతార, ధనుష్ మధ్య గత కొంతకాలంగా కాపీ రైట్స్ కేస్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై నయనతార ఎంతో ఫీల్ అవుతూ, ధనుష్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ఏడాది సోషల్ మీడియా లో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. తన పెళ్ళికి సంబంధించిన డాక్యుమెంటరీ వీడియో లో ‘నానుమ్ రౌడీ థాన్’ చిత్రంలోని ఫుటేజిని అతని అనుమతి లేకుండా వాడుకుంది. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరించగా విజయ్ సేతుపతి, నయనతార హీరోయిన్లు గా నటించారు. నయనతార భర్త సతీష్ విగ్నేష్ ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ సమయంలో తన భర్తతో గడిపిన కొన్ని మధురమైన క్షణాలను ఆమె తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించుకుంది. దీనికి ఆగ్రహించిన ధనుష్ నా అనుమతి లేకుండా నా సినిమా ఫుటేజీ ని వాడుకోవడానికి వీలు లేదు, 24 గంటలోపు దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసాడు.
ధనుష్ ఇచ్చిన ఈ వార్నింగ్ ని నయనతార అసలు పట్టించుకోలేదు. దీనికి మండిపడ్డ ధనుష్, హై కోర్టు లో నయనతార పై 10 కోట్ల రూపాయిలు తనకి చెల్లించాలంటూ కాపీ రైట్స్ కేస్ వేసాడు. దీనిని సవాలు చేస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ కౌంటర్ పిటీషన్ ని దాఖా చేసింది. ఇటీవలే విచారణకు వచ్చిన ఈ పిటీషన్ ని కోర్టు కొట్టిపారేసింది. దీంతో ఇప్పుడు నయనతార కచ్చితంగా ధనుష్ కి పది కోట్ల రూపాయిలు చెల్లించాల్సిందేనా?, లేకపోతే అతనితో కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉంటున్నారు. కలిసి సినిమాలు కూడా చేసారు, ఇంత రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ధనుష్ ఇలా ప్రవర్తించడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో లో నయనతార గత చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ఫుటేజీలను కూడా వాడుకుంది.
కానీ ఆ చిత్రాల నిర్మాతలు నయనతార ని ఇలా ఇబ్బందికి గురయ్యేలా చేయలేదు. ధనుష్ మాత్రం ఇంత యాటిట్యూడ్ తో ప్రవర్తించడం నిజంగా తప్పే. నయనతార తో అతనికి గతంలో పెద్ద గొడవలు ఏమైనా జరిగాయా అంటే అది కూడా లేదు. అయినప్పటికీ ఇంత పగ ఆమెపై ఎలా పెంచుకున్నాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో ధనుష్ అభిమానులు సైతం మాట్లాడుకుంటున్నారు. మన ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ల మధ్య కానీ, మరే ఇతర ఆర్టిస్టుల మధ్య కానీ, ఇలాంటి యాటిట్యూడ్ లేకపోవడం సంతోషాన్ని కలిగించే విషయం. కొంతమంది హీరోల మధ్య కోల్డ్ వార్ నడిచినప్పటికీ, ఈ రేంజ్ లో మాత్రం ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో కుభేర అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.