అక్కినేని సమంత (Samantha) వరుస సినిమాలు చేస్తోంది, ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లో పాల్గొంటుంది. పైగా సామ్ చేసే ప్రతి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం.. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతుంది సమంత. ఇక ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా.
అన్నట్టు ఈ సినిమా షూటింగ్ ను సామ్ చాలా స్పీడ్ గా పూర్తి చేసింది. కేవలం నాలుగు నెలల్లో తన తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసి.. ‘శాకుంతలం’నికి మొత్తానికి బాయ్ చెప్పింది. ఇప్పుడు మరో సినిమా పై పడింది సామ్. గతేడాది నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో వస్తున్న ఓ చిత్రంలో నటించడానికి సమంత ఒప్పుకుంది.
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తోంది. మొత్తానికి ‘శాకుంతలం’ను పూర్తి చేసి ‘నయనం’ వైపు సమంత పయనం అయింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లుగా ఈ సినిమా రానుంది. నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదేనేమో.
దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. పైగా నయనతారనే నిర్మాత. జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే షూట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ షూట్ కేరళలో జరుగుతుంది.