Homeఎంటర్టైన్మెంట్Pushpa, SVP videos Leak: 'సర్కారు, పుష్ప' లీకుల వెనుక ఉన్నది ...

Pushpa, SVP videos Leak: ‘సర్కారు, పుష్ప’ లీకుల వెనుక ఉన్నది అతనే !

Mahesh Babu Allu Arjunస్టార్ హీరోతో ఒక సినిమా తీయాలంటే కనీసం 70 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి, అన్నీ కోట్లు ఖర్చు పెట్టి.. ఆ సినిమాలో కొన్ని కీలక పార్ట్ కి సంబంధించిన సీన్స్ అండ్ షాట్స్ లీక్ అయితే, ఏమి చేయాలి ? అసలు ఎవరు లీక్ చేస్తున్నారో తెలియకపోతే ఏమి చేయాలి ? తమ సంస్థలోని ఆ దొంగలను పట్టుకోలేక అయోమయంలో పడింది మైత్రీ మూవీస్ సంస్థ.

ఆ సంస్థ ‘సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata), పుష్ప(Pushpa)’ చిత్రాలను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్ లీక్ అయ్యాయి. పైగా విడుదల సమయానికి కంటే ముందే సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. సడెన్ గా లీక్ కావడంతో ఇక చేసేది ఏమి లేక మేకర్స్ హడావిడిగా టీజర్ ను, సాంగ్ ను ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ఇంతకీ ఈ లీక్ లు వెనుక ఎవరు ఉన్నారు ? అనేది తెలుసుకోవడానికి గత నాలుగు రోజులుగా ఆ సంస్థ కసరత్తులు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తమ రెండు భారీ సినిమాలకు సంబంధించిన కంటెంట్స్ ను లీక్ చేసిన, ఆ లీకుల రాయుళ్లను ఎట్టిపరిస్థితుల్లో వదలమని ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.

ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తూ “త్వరలోనే మిమ్మల్ని పట్టుకుంటాం, తప్పకుండా శిక్షిస్తాం” అంటూ హడావుడి చేసింది. అయితే తాజాగా మైత్రీ మూవీస్ సంస్థకు ఆ లీకులు చేసిన వ్యక్తి దొరికాడు. కానీ సైలెంట్ అయిపోయింది. కారణం ఆ వ్యక్తి తమకు దగ్గర బంధువు. పైగా ఎప్పటి నుండో సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరి ఎందుకు లీక్ చేశాడు అంటే.. తాగిన మత్తులో.. నిర్మాణ సంస్థ అధినేతల్లో ఒకరి పై ఉన్న కోపం కారణంగా లీక్ చేశాడు. ఇప్పుడు ఆయనను మైత్రీ క్షమించ వదిలేసింది. ఇక నుండి ఆ వ్యక్తిని సంస్థకు దూరం పెట్టాలని నిర్ణయించుకుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular