
గ్లామర్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ.. తన పేరు మీదే సినిమా మార్కెట్ అవుతున్నప్పుడు ఏ హీరోయిన్ అయినా ఎంతైనా పారితోషికాన్ని పుచ్చుకోవచ్చు. అందులో తప్పేమి లేదు, సినిమా అనేది అంతిమంగా బిజినెసే కాబట్టి.. లెక్కలను దృష్టిలో పెట్టుకుంటే.. ఆ హీరోయిన్ స్టార్ డమ్ అనేది తీసుకున్న రెమ్యూనరేషన్ కి తగ్గట్లు కలెక్షన్స్ ను రాబడితే చాలు. ఇక ఆ హీరోయిన్ ను లేడీ సూపర్ స్టారే అంటారు. ఈ జనరేషన్ లో అలాంటి లేడీ సూపర్ స్టార్ అంటే.. సౌత్ లో ‘నయనతార’ ఒక్కటే కనిపిస్తోంది.
అందుకే తన రెమ్యూనరేషన్ ని నయనతార భారీగా పెంచేసినా.. షూటింగ్ టైంలో శక్తికి మించిన డిమాండ్స్ ను కోరుతున్నా.. ఒక్క మాట కూడా తేడాగా చెప్పకుండా నిర్మాతలు సైలెంట్ గా అమ్మడు అడిగింది సమర్పించుకుంటున్నారు, కారణం కేవలం నయనతారకు ఉన్న మార్కెట్ ను చూసే. మొన్నటివరకు సౌత్ లో నయనతార సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే నయనతార మెయిన్ లీడ్ గా తమిళంలో కొన్ని సినిమాలు వచ్చి కాసుల వర్షం కురిపించాయి.
అందుకే తన సినిమాలకు వస్తోన్న కలెక్షన్స్ ను లెక్క వేసుకుని మరీ, తన రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేసుకుంది నయనతార. ఇప్పుడు ఏకంగా 6 కోట్ల వరకు నయనతార తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందట. నిజానికి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ను ఏవరేజ్ హీరోలు తీసుకుంటారు. ఇప్పుడు నయనతార కూడా అంత తీసుకుని ఆ హీరోలకు కూడా షాక్ ఇచ్చింది. ఏది ఏమైనా ఎప్పుడో ముదిరిపోయిన నయనతార అంటే సౌత్ లో ఇప్పటికీ క్రేజ్ ఉండటం నిజంగా విశేషమే.
ఇక ఇటు గ్లామర్ హీరోయిన్ గా నటిస్తూనే.. అటు తానే మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూ తనకున్న లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను అల కంటిన్యూ చేసుకుంటూ పోతుంది, పైగా నయనతార ఎలాంటి పాత్రలనైనా అవలీలగా చేయగల నటి. అందుకే ఆమె పై ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.. ఆమె ఇగోకి పోయి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నా అందరూ ఆమెతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడానికి కారణం అదే.