‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ది పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్.. భారీ రెమ్యునరేషన్.. సౌత్ టాప్ హీరోయిన్.. తమిళంలో ఒక ఏవరేజ్ హీరో రేంజ్ లో మార్కెట్ ఉన్న ఏకైక హీరోయిన్.. అన్నిటికీ మించి ఆమె సినిమాలకు క్రేజీ ఓపెనింగ్స్ వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే.. నయనతార అంటే సౌత్ ప్రేక్షకులకు విపరీతమైన ఇష్టం. సౌత్ లో నయనతార డిమాండ్ చూసి.. బాలీవుడ్ ఆమె కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ నయన్ ఇప్పటివరకు హిందీ సినిమా ఒప్పుకోలేదు.
మొదటిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు తొలిసారిగా ఆమె రెడీ అవుతుంది. పైగా ఈ సినిమాకి డైరెక్టర్ అట్లీ. ఇతగాడికి నయనతార ఫేవరేట్ హీరోయిన్. నయనతార కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. మొత్తానికి ఆమెను హిందీ సినిమాకి ఒప్పించాడు. కాకపోతే నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు పుచ్చుకుంటుంది.
కానీ, బాలీవుడ్ డెబ్యూ కోసం మాత్రం అత్యంత భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.7 కోట్ల రెమ్యునరేషన్ ను అడిగిందని సరిపుచ్చుకోలేం. ఎందుకంటే హిందీ టాప్ హీరోయిన్సే 6 కోట్ల దగ్గర ఉన్నారు. అలాంటిది ఒక సౌత్ హీరోయిన్ కి, అదీ ముదురు భామకు ఏడు కోట్లు ఎలా ఇస్తాం అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. 5 కోట్లకు నేను ఒప్పిస్తా అని అట్లీ అభయం ఇచ్చాడు.
మరి చివరకు నయనతార ఎంతకు చేస్తోందో చూడాలి. ఇక ‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా తీసిన ప్రతి సినిమాని హిట్ చేసి, అట్లీ నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చిన యుంగ్ డైరెక్టర్స్ లో అట్లీ తప్ప, మరొకరు లేరు. అందుకే అట్లీ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆగస్టు నుంచి అట్లీ – షారుఖ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.