Homeఎంటర్టైన్మెంట్ఈ వీక్ ఓటీటీ సినిమాల పరిస్థితేంటి ?

ఈ వీక్ ఓటీటీ సినిమాల పరిస్థితేంటి ?

OTT releasesఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఎంట్రీతో సినిమాలు చూసే విధానమే మారిపోయింది. చక్కగా ఇంట్లో కూర్చుని.. నచ్చిన సమయంలో నచ్చిన సినిమా చూస్తూ.. అవసరం అయినప్పుడు సినిమా ఆపేసి.. పని చేసుకుని మళ్ళీ ఎక్కడ నుండి సినిమా ఆపామో అక్కడి నుండే సినిమా చూసి ఎంజాయ్ చేసే వెసులుబాటు ప్రేక్షకుడికి ఇంత త్వరగా కలుగుతుంది అని ఎవరూ ఊహించలేదు.

డిజిటల్‌ తెర ప్రాచుర్యంలోకి రావడంతో ప్రేక్షకులు కూడా తమ ఖాళీ సమయాన్ని ఓటీటీలకే కేటాయిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మొత్తానికి యూత్‌ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంటోన్న డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ కి ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు. పైగా ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది.

మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం..

కోల్డ్‌ కేస్‌ :

తను బాలక్‌ దర్శకత్వంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కోల్డ్‌ కేస్‌. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 30న రిలీజ్‌ కానుంది.

హసీన్‌ దిల్‌రుబా :

వినిల్‌ మాథ్యూ డైరెక్షన్‌ లో తాప్సీ పన్ను, విక్రాంత్‌ మాస్సే, హర్షవర్ధన్‌ రానే ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా హసీన్‌ దిల్‌రుబా. నెట్‌ ఫ్లిక్స్‌ లో జూలై 2న ఈ సినిమా విడుదల కానుంది.

ద టుమారో వార్‌ :

క్రిస్‌ మెకే దర్శకత్వంలో క్రిస్‌ ప్రాట్‌, వోనె స్ట్రాహోవ్‌స్కీ, జేకే సిమ్మన్స్‌, బెట్టీ గిల్పిన్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ద టుమారో వార్‌. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది.

సమంతార్‌ సీజన్‌ 2 :

సతీష్‌ రాజ్వడే దర్శకత్వంలో తేజస్విని పండిట్‌, సాయి టామ్‌హంకర్‌, స్వాప్నిల్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ సమంతార్‌ సీజన్‌ 2. ఈ వెబ్‌ సిరీస్‌ జూలై 2 నుంచి ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లోకి అందుబాటులోకి రానుంది.

ఫియర్‌ స్ట్రీట్‌ పార్ట్‌ 1 :

లై జనైక్‌ దర్శకత్వంలో కియానా మడేరియా, ఒలీవియా స్కాట్‌, బెంజిమన్‌ ఫ్లోర్స్‌ జూనియర్‌ నటించిన చిత్రం ఫియర్‌ స్ట్రీట్‌ పార్ట్‌ వన్‌: 1994. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదల కానుంది.

గ్రేస్‌ అనాటమీ సీజన్‌ 17 :

ఎలెన్‌ పాంపియో, చంద్ర విల్‌సన్‌, జేమ్స్‌ పికెన్స్‌ నటించిన వెబ్‌సిరీస్‌ గ్రేస్‌ అనాటమీ. ఈ సిరీస్‌ 17వ సీజన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి స్ట్రీమింగ్‌ అవనుంది.

చుట్జ్‌పా :

వరుణ్‌ శర్మ, మంజోత్‌ సింగ్‌, ఎల్నాజ్‌ నోరోజి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ చుట్జ్‌పా. ఈ సిరీస్‌ సోనీ లైవ్‌లో జూలై 3 నుంచి ప్రసారం కానుంది.

బిగ్‌ టింబర్‌ సీజన్‌ 1 ;

కెవిన్‌ వెన్‌స్టాబ్‌, ఎరిక్‌ వెన్‌స్టాబ్‌, సారా ఫ్లెమింగ్‌ ముఖ్యపాత్రల్లో యాక్ట్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ బిగ్‌ టింబర్‌ సీజన్‌ 17. క్రిస్ట వెర్నాఫ్‌ రన్‌ చేస్తున్న ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి ప్రసారం కానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular