https://oktelugu.com/

బిజినెస్ మొదలుపెట్టిన నయనతార !

లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే పారితోషికం కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్న నంబర్ వన్ హీరోయిన్ కూడా నయనతారే. దాదాపు ఒక్కో సినిమాకి నయన్ నాలుగు కోట్లు తీసుకుంటుంది. అయితే, నయనతార ఆ డబ్బును కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాతగా కూడా ఓ చిత్రం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నయనతార ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టబోతోంది. ‘చాయ్ […]

Written By:
  • admin
  • , Updated On : July 31, 2021 / 04:13 PM IST
    Follow us on

    లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే పారితోషికం కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్న నంబర్ వన్ హీరోయిన్ కూడా నయనతారే. దాదాపు ఒక్కో సినిమాకి నయన్ నాలుగు కోట్లు తీసుకుంటుంది. అయితే, నయనతార ఆ డబ్బును కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాతగా కూడా ఓ చిత్రం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.

    కాగా తాజాగా నయనతార ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టబోతోంది. ‘చాయ్ వాలా’ అనే కాఫీ/టీ షాప్ ల కంపెనీలో 5 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ కంపెనీ చెన్నైలో అనేక ప్రాంతాల్లో టీ రెస్టారెంట్లు నడుపుతూ ఉంది. ఈ కంపెనీ యాజమాన్యంతో నయనతారకి ముందు నుండి మంచి అనుబంధం ఉంది.

    పైగా ఈ కంపెనీకి చాలా గ్రోత్ ఉందని నమ్మని నయనతారకు ఇంకా భవిష్యత్తులో ఎక్కువ పెట్టుబడి పెట్టే ఆలోచనలో కూడా ఉంది. అలాగే, తన అభిరుచికి, మరియు తనకు ఇష్టమైన మెన్యు కి అనుగుణంగా ఒక హై క్లాస్ రెస్టారెంట్ ను పెట్టాలనే ప్లాన్ లో కూడా ఉంది నయనతార. మొత్తానికి నయనతార తన భవిష్యత్తు మొత్తాన్ని బిజినెస్ లోనే ప్లాన్ చేస్తోంది అన్నమాట.

    ఇప్పటికే వయసు కూడా పై పడింది. 35 ఏళ్ళు దాటింది నయనతార. మహా అయితే, హీరోయిన్ గా నయనతార కెరీర్ మరో రెండేళ్లు ఉంటుంది. అందుకే, తెలివిగా ఈ లోపే వేరే ఫీల్డ్ లో పెట్టుబడులు పెట్టి… ఫ్యూచర్ ను బాగానే ప్లాన్ చేసుకుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ తో కలిసి ఉంటున్న నయనతార త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోనుంది.