https://oktelugu.com/

Yavar – Nayani : ప్రియుడు యావర్ కి హ్యాండిచ్చిన నయని… స్టేజి మీదే కన్నీరు మున్నీరైన బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తున్నారు. సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేము జస్ట్ ఫ్రెండ్స్ ప్రేమలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2024 / 08:29 PM IST

    Yavar - Nayani

    Follow us on

    Yavar – Nayani : స్టార్ మా లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ 2.0 దుమ్మురేపుతోంది. రియల్ జోడీలు, రీల్ జోడీలు.. ఒకరిని మించి మరొకరు డాన్స్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ – నయని పావని జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అద్భుతమైన కెమిస్ట్రీ పండిస్తూ ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇద్దరు కలిసి రీల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ సన్నిహితంగా ఉంటున్నారు.

    ఇప్పుడు నీతోనే డాన్స్ 2.0 లో జతకట్టారు నయని – ప్రిన్స్ యావర్. గత వారం ఈ జంట చేసిన పర్ఫార్మెన్స్ చాలా చూడ ముచ్చటగా అనిపించింది. ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కానీ అనూహ్యంగా నయని షో నుంచి తప్పుకుంది. తన ప్లేస్ లోకి వాసంతి వచ్చింది. గతంలో కూడా వాసంతి నీతోనే డాన్స్ లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ – వాసంతి జోడిగా గత సీజన్ లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో యాంకర్ శ్రీముఖి కంగారు పడింది.

    ‘ హనీమూన్ కి వెళ్లాల్సిన దానివి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ ‘ అని అడిగింది. నాకు ఇదే ఇంపార్టెంట్ అని వాసంతి షాక్ ఇచ్చింది. దీంతో శ్రీముఖి ‘ యావర్ లవర్ ఏదయ్యా ‘ అని అడగ్గా .. వదిలేసి వెళ్లిపోయింది అంటూ తెగ ఏడ్చేశాడు. వాసంతి కూడా మంచి డాన్సర్ కావడం యావర్ కి ప్లస్ అవుతుంది. అయితే ఇటీవల వాసంతి తన ప్రియుడు పవన్ కళ్యాణ్ ని పెళ్లాడింది. పెళ్ళై హనీమూన్ కి వెళ్లాల్సిన ఆమె ఇలా ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్య పరిచింది.

    ఒకటి రెండు ఎపిసోడ్స్ కోసం వాసంతి… నయని స్థానంలో పర్ఫార్మ్ చేయనుందా .. లేదంటే మొత్తానికి నయని నీతోనే డాన్స్ కి గుడ్ బై చెప్పిందో తెలియాల్సి ఉంది. యావర్ – నయని విషయానికొస్తే .. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తున్నారు. సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేము జస్ట్ ఫ్రెండ్స్ ప్రేమలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు.