https://oktelugu.com/

Naveen Polishetty: రెండు సంవత్సరాలు నరకం చూసాను అంటూ సంచలన కామెంట్స్ చేసిన నవీన్ పోలిశెట్టి

తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ హీరో. ఇక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి చెప్పుకొచ్చారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 12, 2023 / 04:27 PM IST

    Naveen Polishetty

    Follow us on

    Naveen Polishetty: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ స్వయంకృషితో వచ్చి.. ప్రస్తుతం తెలుగులో మంచి అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈ హీరో మొదటగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చారు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోకి యంటీగా గోల్డ్ ఫేస్ అబ్బాయి గా కనిపించారు. ఆ క్యారెక్టర్ ద్వారా కొంచెం విజిబిలిటీ సంపాదించారు నవీన్.

    కాగా ఫైనల్ గా ఈ హీరో ఎదురుచూసిన అదృష్టం మాత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో దక్కింది. ఇక ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిట్ హిందీ సినిమాలలో కూడా నటించారు. ఇక ఈ ప్రస్తుతం ఈ హీరో నటించినా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ హీరో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

    తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ హీరో. ఇక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి చెప్పుకొచ్చారు.

    సిల్వర్ స్క్రీన్ పై మనల్ని ఎంతో నవ్వించే నవీన్ పోలిశెట్టి జీవితంలో మాత్రం కొన్ని కష్టాలను ఎదురుకున్నారట. అదే విషయం గురించి చెబుతూ.. ‘సినిమాల పైన ఆసక్తి ఉండడంతో ఉద్యోగం కూడా వదిలేసి ముంబైకి వెళ్ళిపోయాను.. అక్కడ దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఆడిషన్స్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే ఆడిషన్ కి వెళ్లే సమయంలో నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని’ అని చెప్పుకొచ్చారు ఈ హీరో.

    ‘ నేను వెళ్లిన ప్రతిసారి కూడా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక వారు రెస్టారెంట్ కు వెళ్దామని చెప్పేవారు.. అలాంటి సమయంలో నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ విషయం వారికి చెప్పలేను. అందుకే వెళ్లకుండా ఉండడానికి చాలా కారణాలు చెప్పేవాణ్ణి’ అంటూ చెప్పుకొచ్చారు ఈయన.

    అంతేకాదు నవీన్ ఆడిషన్స్ కి వెళితే తనను వెంటనే చూడకుండానే చాలామంది రిజెక్ట్ చేశారని మరికొంతమంది నల్లగా ఉన్నావు కాస్త సర్జరీ చేయించుకోవచ్చు కదా అంటూ.. తన బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేయొచ్చు కదా అంటూ చాలా దారుణంగా అవమానించే వారిని చెప్పుకొచ్చారు ఈ హీరో. అలా రెండేళ్ల పాటు నరకం చూశానని తెలిపారు.

    ఇక ప్రస్తుతం మాత్రం వరుసగా హిట్లు అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నారు నవీన్.