NTR Letter: ఎన్టీఆర్ రాసిన ఈ లెటర్లో వీటిని గమనించారా?

తెలుగు భాషపై పట్టున్న ఆయన ఆ కాలంలో 1100 మంది రాసిన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని పొందారు.

Written By: Chai Muchhata, Updated On : September 12, 2023 4:30 pm

NTR Letter

Follow us on

NTR Letter: నందమూరి తారకరామారావు ఇప్పుడు మనమధ్య లేకున్నా.. ఆయన గుర్తులు మాత్రం అలాగే ఉన్నాయి. సినిమాల గురించి చెప్పినప్పుడు అన్నగారి పేరు రాకుండా ఉండదు. అలాగే రాజకీయాల గురించి ఉపన్యాసం చేసినా.. ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. ఎన్టీఆర్ సినిమా, రాజకీయాల్లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. సినిమాల్లోకి రాకముందే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు అంటే ఆ కాలంలోనే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.సినిమాల్లో సక్సెస్ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. ఇందులో ఎన్టీఆర్ స్వయంగా ఆయన చేతితో ప్రసంగాన్ని రాశారు. ఈ లెటర్ లో ఉన్న అక్షరాలను చూసి ఇది ప్రింట్ అనుకున్నారు. కాన ముత్యాల్లాంటి ఆయన చేతిరాతే అని తెలిశాక ఆశ్చర్యపోయారు. అయితే ఇందులో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే?

ఇటీల ఎన్టీఆర్ చేతిరాత గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ కాలంలోనే అందంగా అక్షరాలు లిఖించిన ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మద్రాసు రాజ్యంలో విజయవాడ మున్సిపల్ స్కూల్లో చదివిని ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచే ప్రతిభావంతుడు. చదువులో రాణిస్తూ అందరి మన్ననలు పొందేవారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు నాటకాలు వేసి అలరించేవారు. అయితే చదువు పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు.

తెలుగు భాషపై పట్టున్న ఆయన ఆ కాలంలో 1100 మంది రాసిన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని పొందారు. అంతేకాకుండా ఆయనకు చిత్రలేఖనంలో కూడా మంచి పట్టుంది. ఇలాంటి ప్రత్యేక ప్రతిభ ఉన్న ఎన్టీఆర్ చివరిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో సక్సెస్ జీవితాన్ని నడిపిన ఎన్టీఆర్.. విరామ సమయంలో సినీ పత్రికలను ఎక్కువగా చూస్తుండేవారు. దీంతో ఆయన ‘విజయచిత్ర’ అనే పత్రిక ద్వారా తన గురించి అభిమానులు, ప్రజలకు సందేశం పంపాలనుకున్నాడు.

అప్పట్లో సినీ సమాచారాన్ని ‘విజయచిత్ర’ అనే పత్రిక ప్రజలకు అందించేది. దీంతో ఎన్టీఆర్ స్వయంగా తన చేత్తో ఓ లెటర్ రాశాడు. ఇందులో ఎన్టీఆర్ తన జీవితంలో సాధించిన విజాయాన్ని ఇతరులతో పంచుకుంటూ రాశాడు. అయితే ఈ లెటర్ లో ప్రింట్ గుద్దినట్లు ఆశ్చర్యార్థకాలు ఎక్కువగా వాడారు. అంటే ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పినప్పుడు, ఆశ్చర్యాన్ని కలింగించే విషయం తెలిపినప్పుడు ఇలా ఆశ్చర్యార్తకం లెటర్ వాడుతారు. ఎన్టీఆర్ రాసిన ఈ లెటర్ లో ఎక్కువగా ఆశ్చర్యార్థక గుర్తులు కనిపిస్తాయి. అంతేకాకుండా సెమీకోలన్ లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎలాంటి తప్పలు లేకుండా అచ్చమైన తెలుగును ఎన్టీఆర్ ప్రజల ముందు ఉంచాడని అర్థమవుతుంది.