Anaganaga Oka Raju Teaser Talk: చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోస్ లో ఒకరు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). యంగ్ హీరోలలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని కోణాల్లో అలరించే అతి తక్కువ మంది ఆల్ రౌండర్స్ లో నవీన్ పోలిశెట్టి కచ్చితంగా ఒకడిగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇతని మీద వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే సినిమాలు చాలా తక్కువ చేస్తాడు అని. ఆయన గత చిత్రం ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ విడుదలై దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. ఈ మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ‘అనగనగ ఒక రాజు’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ టీజర్ ద్వారా నవీన్ పోలిశెట్టి ఆడియన్స్ ని అలరించాడు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) నటించింది. ముందుగా శ్రీలీల(Sreeleela) ని తీసుకున్నారు కానీ, ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె స్థానం లోకి మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ఈ టీజర్ లో కూడా మీనాక్షి చౌదరి బాగానే అలరించింది. ఈమధ్య కాలం లో ఎక్కువగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కనిపిస్తుంది. అందుకే ఆమె పై ఆమెనే సెటైర్ వేసుకునేలాగా, మా సినిమా సంక్రాంతికి రాబోతుంది అంటూ ఒక ప్రకటన లాగా చెప్పించారు. ఇది చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. నవీన్ పోలిశెట్టి దానికి కౌంటర్ ఇవ్వడం బాగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుందని అర్థం అవుతుంది. చూడాలి మరి సంక్రాంతికి ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుంది అనేది. ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న ఈ సినిమా టీజర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
