https://oktelugu.com/

Hero Navadeep : నిర్మాతగా మారి భారీ నష్టాలను కొని తెచ్చుకున్న హీరో నవదీప్..సరైన సమయంలో ఆదుకున్న అల్లు అర్జున్!

అబ్బో అనిపించే సన్నివేశాలు పెద్దగా ఏమి ఉండవు కానీ, టైం పాస్ అయ్యే చిత్రం అని మాత్రం చెప్పొచ్చు. ఆహా మీడియా లో ఉన్న యూజర్లు వెంటనే ఈ సినిమాని చూసేయండి.

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2024 / 10:23 PM IST

    Navdeep

    Follow us on

    Hero Navadeep : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు నవదీప్. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జై’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టిన ఈయన, కెరీర్ లో హీరో గా ఒకటి రెండు సూపర్ హిట్స్ మినహా, ఎక్కువ శాతం ఫ్లాప్స్ ఉన్నప్పటికీ, మంచి నటుడిగా ప్రేక్షకుల్లో ఒక బలమైన ముద్ర వేసుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా ఆయన రాణించాడు. ముఖ్యంగా క్యారక్టర్ ఆర్టిస్టు అయ్యాక నవదీప్ కి తెలుగు తో పాటు, తమిళం మరియు ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆయన నిర్మాతగా మారి రీసెంట్ గా ‘ఏవం’ అనే చిత్రం చేసాడు.

    జూన్ 14 , 2024 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా నెగటివ్ రివ్యూస్ ని దక్కించుకొని ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. చాందిని చౌదరీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ప్రముఖ ఇంస్టాగ్రామ్ సెలబ్రిటీ, తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాని నిర్మించడానికి నవదీప్ దాదాపుగా రెండు కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడు. ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో చేసాడు. కానీ సినిమా లో దమ్ము లేకపోవడంతో విడుదలైన సంగతి జనాలకు పూర్తిగా తెలిసేలోపే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. నిర్మాతగా నవదీప్ కి భారీ నష్టాలను కలిగించింది. అయితే నవదీప్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి ఆర్య 2 , అలా వైకుంఠపురంలో వంటి సినిమాల్లో నటించారు. అయితే అల్లు అర్జున్ తో నవదీప్ కి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆహా మీడియా లో పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు, స్పెషల్ టాక్ షోస్ నవదీప్ చేత నిర్వహింపచేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా.

    సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో అల్లు అర్జున్ చొరవతో నవదీప్ కి మంచి అవకాశాలు లభించాయి. ఇప్పుడు ‘ఏవం’ చిత్రం అతనికి చేసిన నష్టాలను కూడా పూడ్చేలా చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఆహా మీడియా కి ఇప్పించడమే కాదు, తన పలుకుబడితో సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కూడా అమ్మించేలా చేసాడు. దీంతో 5 కోట్ల రూపాయిల లాభం నవదీప్ కి దక్కినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఆహా మీడియా లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అబ్బో అనిపించే సన్నివేశాలు పెద్దగా ఏమి ఉండవు కానీ, టైం పాస్ అయ్యే చిత్రం అని మాత్రం చెప్పొచ్చు. ఆహా మీడియా లో ఉన్న యూజర్లు వెంటనే ఈ సినిమాని చూసేయండి.