https://oktelugu.com/

డ్రగ్ కేసులో రకుల్ పేరు వైరల్.. నవదీప్ కౌంటర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే విషయాన్ని తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ లింకులు బయటపడటంతో పోలీసులు దర్యాప్తును ఆ దిశగా చేస్తుండటంతో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఇప్పటికే పీకల్లోతు ఇరుక్కుపోయింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్ లను పోలీసులు అరెస్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2020 / 01:35 PM IST

    Navadeep drug case

    Follow us on

    బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే విషయాన్ని తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ లింకులు బయటపడటంతో పోలీసులు దర్యాప్తును ఆ దిశగా చేస్తుండటంతో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

    డ్రగ్స్ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఇప్పటికే పీకల్లోతు ఇరుక్కుపోయింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్ లను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. రియా చక్రవర్తి ఆదేశాలతోనే సుశాంత్ డ్రగ్స్ ఇచ్చినట్లు రియా సోదరుడు పోలీసులకు చెప్పాడు. దీంతో ఆమెను పోలీసులు మూడురోజులు పాటు విచారించి అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు కస్టడీని విధించింది.

    సీబీఐ, ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి 25మంది సెలబ్రెటీల పేర్లు వెల్లడించింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఇప్పటికే పోలీసులు పలువురు స్టార్లకు నోటీసులు పంపారు. అయితే ఇందులో టాలీవుడ్లో అగ్రనటిగా పేరున్న రకుల్ ప్రీతిసింగ్ పేరు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ కేసులో రకుల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ కేసు అటూ ఇటూ తిరిగి మళ్లీ టాలీవుడ్ ను తాకుతుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    దీనిపై ఓ నెటిజన్ యంగ్ హీరో నవదీప్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డ్రగ్స్ కేసు మళ్లీ టాలీవుడ్ వైపు యూటర్న్ తీసుకుంటుంది.. నవదీప్ అన్న జాగ్రత్త.. మనకు కూడా బాధలు తప్పేలా లేవంటూ కామెంట్ చేశారు. దీనిపై నవదీప్ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘నాకు ఎలాంటి బాధ లేదు బ్రదర్.. నువ్వు కూడా బాధపడాల్సిన పనిలేదు.. పద పనికొచ్చే పనిచేద్దాం’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.