ప్రపంచవ్యాప్తంగా చివరి దశ ప్రయోగాల్లో ఉన్న 9 వ్యాక్సిన్లలో ఆక్స్ ఫర్డ్ టీకా కూడా ఒకటి. బ్రిటన్ తోపాటు అమెరికా, భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాల్లో ఈ ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అన్ని దేశాల వారు ఆశలు పెంచుకున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను తిరిగి ఈరోజు ఆదివారం మొదలయ్యాయి. ఇటీవల ట్రయల్స్ లో బ్రిటన్ కు చెందిన ఓ వలంటీర్ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Also Read: అమిత్ షాకు తిరగబెట్టిన ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో చేరిక
తాజాగా ప్రయోగాలను మళ్లీ పునరుద్ధరించినట్లుగా ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్ లో జరగడం మామూలేనని నిపుణులు చెబుతున్నారు. యూకే, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో 30వేల మందిపై ఆక్స్ ఫర్డ్ టీకా మూడో దశ ప్రయోగాలు నడుస్తున్నాయి. బ్రిటన్ లోని మెడిసన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్.ఆర్.ఏ) వ్యాక్సిన్ కు క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఎట్టకేలకు మళ్లీ క్లినియల్ ట్రయల్స్ మొదలయ్యాయి.
వ్యాక్సిన్ సేఫ్టీపై ఓ స్వతంత్ర్య కమిటీని నియమించారు. బ్రిటన్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ సేఫ్టీని ధ్రువీకరిస్తూ ఆ కమిటీ మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీకి సిఫారసు చేసింది. దీంతో మళ్లీ ప్రయోగాలకు ఆక్స్ ఫర్డ్ సిద్ధమైంది.
Also Read: ‘ఇదే నేటి భారతం’ అంటూ కంగనాపై ప్రకాశ్ రాజ్ సెటైర్
కాగా టీకాతో ఆరోగ్యం విషమించిన వ్యక్తికి ఇతర అనారోగ్య సమస్యల వల్లే ఇలా జరిగిందని గుర్తించినట్టు సమాచారం. అందుకే టీకా ప్రయోగాలు మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది.