Shyam Singaroy Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24 తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో పాన్ ఇండియా రెంజ్ లో విడుదల చేస్తున్నారు. నాని కేరీయర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావడం విశేషం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

కాగా నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను వరంగల్ లో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్… సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ సింగరాయ్కు గల అనుబంధం ఏంటీ అనేది ట్రైలర్లో చూపించారు. పిరికివాళ్లే కర్మ సిద్ధాంతాన్నే మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమాం గోప్పది కాదు… తప్పని తెలిసాక.. దేవుడ్ని కూడా ఏదిరించడంలో తప్పు లేదు అని నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టు కుంటున్నాయి. హీరోయిన్ కృతితో రొమాంటిక్ కిస్ సీన్ ను కూడా ట్రైలర్ లో చూపించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు.
A Rebellion with Cause ✊
An Aspirant with Vision🤘Witness Natural🌟 @NameisNani in Never Before Seen avatar❤️🔥
Presenting #SSRTrailer 🔥
►https://t.co/AAuuJE6XJS#ShyamSinghRoy 🔱#SSRonDEC24th@Sai_Pallavi92 @IamKrithiShetty @MickeyJMeyer @Rahul_Sankrityn @NiharikaEnt
— Niharika Entertainment (@NiharikaEnt) December 14, 2021