Natural Star Nani : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఒక పక్క హీరో గా, మరో పక్క నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటూ ఎంత జోష్ తో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన సినిమా వస్తుందంటే ఆడియన్స్ కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థాయి నమ్మకాన్ని ఆయన జనాల్లో సంపాదించుకున్నాడు. నాని అంటే ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. రెస్పాన్స్ అదిరిపోయింది. కచ్చితంగా నాని కెరీర్ లో డబుల్ డిజిట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న మరో చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : మెగా అభిమానులు మర్చిపోలేని రోజుగా మారనున్న మే9..చరిత్రలో ఇదే తొలిసారి!
ఇది కాసేపు పక్కన పెడితే ‘హిట్ 1’ లో హీరో గా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన సంగతి తెలిసిందే. ‘హిట్ 2’ లో కూడా ఆయనే హీరో గా నటిస్తాడని అప్పట్లో అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా అడవి శేష్ ఆ చిత్రం లో హీరో గా ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాదు, విశ్వక్ సేన్ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసాడని, అందుకు నాని ఒప్పుకోకపోవడంతో విశ్వక్ ని పక్కన పెట్టి అడవి శేష్ తో చేసాడని ఒక రూమర్ ప్రచారం అయ్యింది. ఈ రూమర్స్ పై ఇన్ని రోజులు నాని స్పందించలేదు కానీ, రీసెంట్ గా హిట్ 3 ప్రొమోషన్స్ లో యాంకర్ ఈ రూమర్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు స్పందించాడు.ఆయన మాట్లాడుతూ ‘విశ్వక్ నాకు మంచి స్నేహితుడు. రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. మా మధ్య విబేధాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి అర్థం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ ‘ హిట్ సిరీస్ కేవలం ఒక్క హీరో ని ఆధారంగా తీసుకొని చేయాలనుకోలేదు. అందుకే నేను ఈ చిత్రంలో హీరోగా నటించాను. ఈ సిరీస్ తదుపరి చిత్రం లో నేను కనిపించను. ఈ సిరీస్ నుండి రాబోయే సినిమాల్లో కథ డిమాండ్ ని బట్టి విశ్వక్ సేన్, అడవి శేష్ ఇద్దరు కనిపించొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ట్రైలర్ తో ఈ సినిమాపై ఆడియన్స్ ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయి మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు నాని ని ఇంత వయొలెంట్ గా ఆడియన్స్ ఎప్పుడూ చూడలేదు. సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ని జారీ చేసారు. సెకండ్ హాఫ్ చాలా సాలిడ్ గా ఉందని, నాని గత చిత్రాలకంటే భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు ఈ సినిమాని చూసిన ప్రముఖులందరూ.
Also Read : ఈ కుర్రాడు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా…