Nani : ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల కంటే తక్కువ వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయిల రూపాయిల ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎప్పుడో 2023 వ సంవత్సరం, డిసెంబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం కారణంగా ఇప్పుడు హీరో నాని చిక్కుల్లో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్యా ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని ఇటీవలే చూసి, ఈ సినిమా తాను నిర్మించిన ‘భీమసేన నలమహారాజా’ చిత్రానికి కాపీ. నా అనుమతి తీసుకోకుండా, నాకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఫ్రీమేక్ చేసారని, మరీ ఇంత చీప్ గా ప్రవర్తిస్తావని అనుకోలేదని నేచురల్ స్టార్ నాని ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ వేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అసలే నాని పై గత రెండు మూడు రోజులుగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ అభిమానులతో నాని ఫ్యాన్స్ ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ చిత్రం పై ఈ వివాదం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘భీమసేన నలమహారాజా’ చిత్రం 2020 వ సంవత్సరం లో తెరకెక్కి, అప్పటి కోవిద్ ఆంక్షల కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని చూస్తే ఆ చిత్ర నిర్మాత చేసే ఆరోపణల్లో నిజముంది అనేది అర్థం అవుతుంది. రెండు చిత్రాలు దాదాపుగా ఒకే తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కినవే. డైరెక్టర్ సౌరభ్ ఉద్దేశపూర్వకంగా చేసుంటే కచ్చితంగా ఇది చాలా పెద్ద తప్పు, కోర్టుకు వెళ్తే శిక్షార్హులు కూడా అవుతారు. మరి దీనికి ‘హాయ్ నాన్న’ టీం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం నాని ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నాని చేస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ చిత్రం తో నాని వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరిపోతాడని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.