Homeఆంధ్రప్రదేశ్‌Balakrishna: క్యాంపు రాజకీయాలు.. బాలకృష్ణ అలెర్ట్.. వేడెక్కిన హిందూపురం

Balakrishna: క్యాంపు రాజకీయాలు.. బాలకృష్ణ అలెర్ట్.. వేడెక్కిన హిందూపురం

Balakrishna: ఏపీలో( Andhra Pradesh) ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. క్యాంపు రాజకీయాలకు తెర లేవనుంది. మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థలకు సంబంధించి చైర్మన్లు, వైస్ చైర్మన్ ల ఎంపిక జరగనున్న సంగతి తెలిసిందే. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న పాలకవర్గాల నియామకానికి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మున్సిపాలిటీలకు సంబంధించి క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. హిందూపురం మున్సిపాలిటీకి గత కొంతకాలంగా చైర్పర్సన్ లేరు. అధికారులే మున్సిపాలిటీని నడుపుతూ వచ్చారు. అయితే ఇక్కడ చైర్పర్సన్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక్కడ వైసీపీకి మెజారిటీ ఉంది. ఈ ఎన్నికలకు ముందు.. తరువాత పరిణామాలు శరవేగంగా మారాయి. అందుకే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. చైర్ పర్సన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

* వైసీపీ ఏకపక్ష విజయం
మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) హిందూపురం మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ 38 వార్డులకు గాను 30 వార్డులను వైసిపి ఏకపక్షంగా కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎనిమిది వార్డులకు పరిమితం అయ్యింది. దీంతో మున్సిపల్ పీఠం వైసిపి చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. హిందూపురం మున్సిపాలిటీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు బాలయ్య బాబు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టారు. దీంతో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టిడిపి వైపు చూశారు. దీంతో 12 మంది వైసీపీ కౌన్సిలర్లను తన వైపునకు లాగేస్తారు బాలయ్య. దీంతో టిడిపి బలం 20 మంది కౌన్సిలర్లకు చేరింది. మున్సిపాలిటీలో టిడిపికి లైన్ క్లియర్ అయింది.

* ఫిబ్రవరి 3న ఎన్నిక
మరోవైపు అక్కడ మున్సిపల్ చైర్ పర్సన్( Municipal chait person) తనంతట తాను రాజీనామా చేయడంతో.. ఎన్నిక అనివార్యంగా మారింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయించింది. దీంతో తెలుగుదేశం పార్టీ ముందుగానే జాగ్రత్త పడింది. 20 మంది కౌన్సిలర్లతో పటిష్టంగా కనిపిస్తున్న టిడిపి.. వారందరినీ క్యాంపునకు తరలించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న మున్సిపల్ కార్యాలయానికి నేరుగా చేరుకునేలా ప్రణాళిక రూపొందించింది. మొత్తానికైతే హిందూపురం మున్సిపల్ కార్యాలయం పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని తేలింది.

* బాలకృష్ణ ఓటమికి ప్రయత్నం
హిందూపురం( Hindu Puram ) నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ గెలుస్తూనే ఉంది టిడిపి. ఈ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఓడించాలని వైసీపీ చాలా విధాలుగా ప్రయత్నాలు చేసింది. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే హిందూపురం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రకరకాలుగా ప్రయోగాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. అయితే అప్పట్లో మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం దక్కేసరికి.. సార్వత్రిక ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని వైసిపి భావించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు ఏకంగా మున్సిపల్ పీఠాన్ని వదులుకునే పరిస్థితి వచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular