Deeksha Seth: ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్, మంచు మనోజ్ ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ జోడిగా నటించింది. అందంతో, నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. కానీ దురదృష్టవశాత్తు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు కెరియర్ స్టార్టింగ్ లో మోడల్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2009లో ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది ఈ బ్యూటీ. ఇక 2010లో ఒక సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో ఈమెకు వరుసగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు వచ్చాయి. ప్రభాస్, రవితేజ, మంచు మనోజ్, అల్లు అర్జున్, గోపీచంద్, వంటి తెలుగు హీరోలతో పాటు విక్రమ్, దర్శన్ వంటి సౌత్ హీరోలతో కూడా జోడిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె సినిమా కెరియర్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలలో కొన్ని సినిమాలలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ సడన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. 2012 తర్వాత ఈమె మరొక తెలుగు సినిమాలో కనిపించలేదు. వరుసగా పరాజయాలు పలకరించడంతో ఈమె క్రమ క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక 2016లో ఒక హిందీ సినిమాలో చివరిసారిగా నటించింది.
సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈ అందాల తార సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈమె మరెవరో కాదు రవితేజ హీరోగా నటించిన మిరప కాయ్ సినిమా హీరోయిన్ దీక్ష సేత్. సినిమాలలో నటించి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న దీక్ష 2016 లో రిలీజ్ అయిన సాథ్ కదం అనే హిందీ సినిమాలో చివరిసారిగా నటించింది. ఆ తర్వాత ఈమె మరొక సినిమాలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.
దీక్షా సేథ్ తన గ్లామరస్ మరియు ఫ్యాషనబుల్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తను బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో హీరోయిన్ దీక్ష సేథ్ ను చూసినా నేటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమె అసలు దీక్ష సేతే నా, ఇలా తయారయింది ఏంటి అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram