Nani- Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీలో హీరో నాని నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. హీరో నాని దీనిపై స్పష్టత ఇచ్చారు. సర్కారు వారి పాట చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీకి సిద్ధం అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జులై నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో భారీ కాలనీ సెట్ నిర్మిస్తున్నట్లు వినికిడి. కాగా ఈ మూవీలో మరో హీరో కీలక రోల్ చేయనున్నారనే వార్త చాలా కాలంగా వినిపిస్తుంది. కథ రీత్యా ప్రాధాన్యత ఉన్న రోల్ కోసం ఓ హీరో కోసం వెతుకుతున్నారట.

ఈ క్రమంలో నితిన్, తారకరత్న, శర్వానంద్ వంటి హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. తారక రత్న పేరుతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఓ హింట్ రావడంతో అది నిజమని అందరూ నమ్మారు. చివరకు మహేష్ మూవీలో నేను నటించడం లేదు. నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదని, తారకరత్న వివరణ ఇచ్చారు. తాజాగా ఈ రోల్ నాని చేస్తున్నారంటూ కథనాలు వెలువడుతుండగా ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మహేష్-త్రివిక్రమ్ మూవీలో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు.
Also Read: Samantha: ఒంటిపై అది లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్

అంటే సుందరానికి మూవీ జూన్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్ మూవీలో నాని నటించడం లేదని వెల్లడైంది. దీంతో మహేష్ మూవీలో నటించే ఆ హీరో ఎవరనే సందేహం అలాగే ఉండిపోయింది. ఇక దాదాపు 11 ఏళ్ళ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలిసి మూవీ చేస్తున్నారు. వీరి లాస్ట్ మూవీ ఖలేజా 2010లో విడుదలైంది. ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ అతడు మంచి విజయం సాధించింది. ఇది బుల్లితెర ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ మూవీగా ఉంది.
Also Read:Jublihils Gang Rape Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ



[…] Also Read:Nani- Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీలో నాని… […]