Nani Hikes Remuneration: నాని షాకింగ్ రెమ్యునరేషన్… ఇప్పుడిదే హాట్ టాపిక్, అంత పెంచేశాడు!

Nani Hikes Remuneration: జయాపజయాలతో సంభందం లేకుండా నాని భీభత్సంగా రెమ్యూనరేషన్ పెంచేస్తున్నాడట. అంటే సుందరానికీ చిత్రానికి కెరీర్ లోనే హైయెస్ట్ వసూలు చేశాడట. నాని రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భలే భలే మగాడివోయ్ మూవీతో ట్రాక్ లోకి వచ్చిన నాని… మజ్ను, నిన్ను కోరి, నేను లోకల్ వంటి హిట్స్ తో మార్కెట్ పెంచుకున్నాడు. నాని చిత్రాలకు రూ. 40 కోట్ల మార్కెట్ ఏర్పడింది. దీనితో నాని సినిమాకు […]

Written By: Shiva, Updated On : June 13, 2022 12:23 pm
Follow us on

Nani Hikes Remuneration: జయాపజయాలతో సంభందం లేకుండా నాని భీభత్సంగా రెమ్యూనరేషన్ పెంచేస్తున్నాడట. అంటే సుందరానికీ చిత్రానికి కెరీర్ లోనే హైయెస్ట్ వసూలు చేశాడట. నాని రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భలే భలే మగాడివోయ్ మూవీతో ట్రాక్ లోకి వచ్చిన నాని… మజ్ను, నిన్ను కోరి, నేను లోకల్ వంటి హిట్స్ తో మార్కెట్ పెంచుకున్నాడు. నాని చిత్రాలకు రూ. 40 కోట్ల మార్కెట్ ఏర్పడింది. దీనితో నాని సినిమాకు రూ. 9 నుండి 10 కోట్లు తీసుకుంటున్నాడు.

Nani

ఇక శ్యామ్ సింగరాయ్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ చిత్రానికి నాని రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైమాటే అట. అనూహ్యంగా అంటే సుందరానికీ చిత్రానికి మాత్రం రూ. 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే సుందరానికీ బడ్జెట్ రూ. 25 కోట్ల లోపే అయ్యిందట. చిన్న డైరెక్టర్, హీరోయిన్ కావడంతో పాటు కథ, జోనర్ రీత్యా తక్కువ బడ్జెట్ లో అంటే సుందరానికీ ముగిసిందట. దీనితో నాని అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారట.

Also Read: Deepika Pilli Dance: యాంకర్ దీపికా పిల్లి ఏమన్నా ఊపేస్తోందా? ఆ అందాల డ్యాన్స్ వీడియో చూస్తే తట్టుకోలేరు!

ఇక ఆయన నెక్స్ట్ మూవీ దసరా కు కూడా అదే స్థాయిలో తీసుకోనున్నారట. అందులోనూ దసరా మూవీ బడ్జెట్ రూ. 60 కోట్లని తెలుస్తుంది. దసరా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది . నాని ఈ మూవీలో లుంగీ కట్టి డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నాని నటించిన చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ మాత్రమే కమర్షియల్ గా ఆడింది. కృష్ణార్జున యుద్ధం, జెర్సీ, గ్యాంగ్ లీడర్, బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయాయి. వి, టక్ జగదీశ్ సైతం ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

Nani

నాని మార్కెట్ డౌన్ అవుతూ వస్తున్నా రెమ్యూనరేషన్ మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. లేటెస్ట్ రిలీజ్ అంటే సుందరానికీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రు. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం యాభై శాతం పెట్టుబడి రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్ళ పరంగా వెనుకబడిపోయింది. నేటితో వీకెండ్ ముగిసింది, దీంతో అంటే సుందరానికీ మరింత కఠిన పరిస్థితులు ఎదురుకానున్నాయి.

Also Read:18 Pages Release Date: స్పీడ్ పెంచిన నిఖిల్… 18 పేజెస్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tags