Natural Star Nani : జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తర్వాత తెలుగు బిగ్ బాస్(Bigg Boss Telugu) కి బెస్ట్ హోస్ట్ ఎవరు అనే ప్రశ్న అడిగితే అత్యధిక శాతం మంది నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పేరు చెప్తారు. బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని హోస్టింగ్ అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సీజన్స్ కంటే, రెండవ సీజన్ లోని కంటెస్టెంట్స్ చాలా టఫ్. ఎన్నో కాంట్రవర్సిలు వచ్చాయి. వాటిని హ్యాండిల్ చేయడం లో నాని సూపర్ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో ఆడియన్స్ నుండి బోలెడంత నెగటివిటీ ని కూడా ఎదురుకున్నాడు. దీంతో ఇక బిగ్ బాస్ జోలికి వెళ్ళను అంటూ రెండవ సీజన్ చివరి ఎపిసోడ్ లో అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ అన్నిటికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. నాగార్జున కూడా బాగానే హోస్టింగ్ చేస్తూ వచ్చాడు కానీ, సీజన్ 8 లో ఆయన హోస్టింగ్ మాత్రం డిజాస్టర్ అని చెప్పాలి.
Also Read : ఆ హీరోయిన్ కోసం రోజంతా వెక్కిళ్లు పెట్టి ఏడ్చానంటూ అల్లు అర్జున్ కామెంట్స్!
సీజన్ 8 లో వచ్చినన్ని కాంట్రవర్సీలు ఏ సీజన్ లో కూడా రాలేదు. హోస్టింగ్ సరిగ్గా చేసి ఉండుంటే గత సీజన్ సెన్సేషనల్ హిట్ అయ్యేది. కేవలం నాగార్జున కారణంగానే ఈ సీజన్ యావరేజ్ అయ్యిందని, నాని హోస్ట్ గా వ్యవహరించి ఉండుంటే కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేదని నెటిజెన్స్ సోషల్ మీడియా లో అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్ చేసారు. దీంతో రీసెంట్ గా హిట్ 3 ప్రొమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ 9 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారా అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు నాని ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీంతో మళ్ళీ నాని బిగ్ బాస్ కి హోస్ట్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ వచ్చేసింది.
ఆయన మాట్లాడుతూ ‘నా జీవితం లో బిగ్ బాస్ అనే చాప్టర్ శాశ్వతంగా క్లోజ్ అయ్యింది. ఈ విషయాన్ని నేను గ్రాండ్ ఫినాలే ముగిసిన వెంటనే అధికారికంగా చెప్పాను. బిగ్ బాస్ కేవలం ఒక గేమ్ షో అనుకోని వెళ్ళాను. కానీ ఆ గేమ్ షో లో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా అని వెళ్ళినప్పుడే తెలిసింది. బయట ప్రపంచం మీద కూడా నాకు అంత అవగాహన ఉండేది కాదు. కానీ బిగ్ బాస్ చూసిన తర్వాత బయట ప్రపంచం ఇలా ఉంటుందా అని నా కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ రియాలిటీ షో. ఈ షో ద్వారా ఎదురైనా పరిస్థితులు నన్ను మరింత టఫ్ గా మార్చాయి. చాలామంది కంటెస్టెంట్స్ పై షో ప్రారంభం అయ్యే ముందు అభిప్రాయాలూ, షో పూర్తి అయిపోయిన తర్వాత మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Also Read : పవన్ కళ్యాణ్ ఒకే అంటే గ్యాంగ్ స్టర్ గా మారనున్న నాని…ఇదెక్కడి ఫిట్టింగ్…