Allu Arjun : అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆమె అందం, అభినయం చూస్తే దేవలోకం నుండి దారి తప్పిపోయి వచ్చిన దేవత లాగా కనిపిస్తుంది. నేటి తరం హీరోలు కూడా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగితే శ్రీదేవి పేరు ని కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. అలాంటి అందాల తార ఇప్పుడు మన మధ్య లేకపోవడం మనం సినీ ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. అయితే శ్రీదేవి ని అమితంగా ఆరాధించే హీరోలలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎన్నో సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూస్ లో శ్రీదేవి కి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ మనసుని శ్రీదేవి ఒక విషయం లో గాయపర్చిందట. ఆమె చేసిన ఒక పనికి రోజంతా ఏడుస్తూ కూర్చున్నాడట. ఇంతకు అల్లు అర్జున్ ని అంతలా గాయపర్చిన సంఘటన ఏమిటి అనేది చూద్దాం.
Also Read : రెట్రో’ చిత్రాన్ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?
ఎప్పుడైతే శ్రీదేవి బోణి కపూర్ ని పెళ్లాడిందో, అప్పుడు కోట్లాది మంది యువకుల హృదయాలు ముక్కలయ్యాయి. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కూడా ఉన్నాడట. ఆమె పెళ్లి చేసుకున్న విషయాన్నీ టీవీ లో చూసి అల్లు అర్జున్ కి హార్ట్ బ్రేక్ అయ్యినంత పని అయ్యిందట. ఆరోజు మొత్తం ఏడుస్తూనే ఇంట్లో కూర్చున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. శ్రీదేవి తో కలిసి పని చేసే అదృష్టం అల్లు అర్జున్ కి ఎలాగో దొరకలేదు. కానీ ఆమె కూతురు జాన్వీ కపూర్ తో కలిసి నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ లో అనేక సినిమాలు చేసిన తర్వాత జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. తొలిసినిమానే భారీ హిట్ అవ్వడంతో జాన్వీ కి అవకాశాలు వెల్లువలాగా వస్తున్నాయి.
‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే . రీసెంట్ గానే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ఒక స్పెషల్ వీడియో ద్వారా అధికారిక ప్రకటన కూడా చేసారు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అనేక ఇంటర్వ్యూస్ లో తనకు ఇష్టమైన హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకడు అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె అభిమాన హీరోతో కలిసి నటించబోతుంది. ఇండియా లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అల్లు అర్జున్ ఇందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది.
Also Read : రూట్ మార్చిన హీరో గోపీచంద్..జనసేన నేత నిర్మాతగా కొత్త సినిమా మొదలు!