Natural Star Nani : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం మే1 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. టీజర్, ట్రైలర్ సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరీ. నాని అంటే ఇన్ని రోజులు లవ్ స్టోరీస్, పక్కింటి కుర్రాడి రోల్స్ లోనే చూసారు జనాలు. ‘దసరా’ నుండి రూట్ మార్చాడు. తన బలమైన జానర్ సినిమాలు చేస్తూనే, మధ్యలో ఇలాంటి ఊర మాస్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాడు. పైగా ఆయన గత మూడు చిత్రాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఓవర్సీస్ లో అయితే స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు అనొచ్చు.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రం..ఎందులో చూడాలంటే!
ఇదంతా పక్కన పెడితే ‘హిట్ 3’ ప్రొమోషన్స్ లో భాగంగా నాని ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూ లో ఆయన హిట్ 3 గురించి ఎవరికీ తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. ముందుగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘హిట్ 2 క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఉంటుంది కదా. అప్పటికే హిట్ 3 కథ సిద్దమైందా, అందుకే ఆ ఎంట్రీ ని పెట్టారా?’ అని అడుగుతాడు. దానికి నాని సమాధానం చెప్తూ ‘అసలు మేము హిట్ 3 ఇప్పట్లో తీయాలని అనుకోలేదు. ‘హిట్ 2’ క్లైమాక్స్ లో ఎదో స్పెషల్ గా ఉంటే బాగుంటుంది, మీరు గెస్ట్ రోల్ కనిపించాలి అని శైలేష్ అడిగితే ఓకే చెప్పి చేసాను. అంతే కానీ ఆ సమయానికి ‘హిట్ 3′ ఏ కాన్సెప్ట్ మీద తియ్యాలి అని కూడా మేము అనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అసలు ఈ సినిమా ఇప్పట్లో చేసే ఆలోచన మాకు లేదు. నాలుగైదు ఏళ్ళు పడుతుందని అనుకున్నాను. ఎందుకంటే నేను వేరే లైనప్ లో ఉన్నాను. కానీ ఒక సినిమా కొన్ని కారణాల వల్ల 8 నెలలు వెనక్కి వెళ్ళింది. అప్పుడు శైలేష్ నా దగ్గర ‘హిట్ 3′ కి ఐడియా ఉంది అంటే రమ్మన్నాను. అలా మొదలైంది ఈ చిత్రం’ అంటూ చెప్పుకొచ్చాడు. షూటింగ్ వాయిదా పడిన నాని కొత్త సినిమా మరేదో కాదు, డైరెక్టర్ సుజిత్ తో చేయబోయేది. ప్రస్తుతం సుజీత్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తి అయ్యాకనే ఈ సినిమాకు వస్తాడు కాబట్టి, ఇంతలోపు హిట్ 3 చిత్రం వచ్చింది కాబట్టి, పరోక్షంగా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కారణం పవన్ కల్యాణే కాబట్టి, ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Pawan Kalyan is the reason behind making #HIT3 #TheyCallHimOG #NaniSujeeth pic.twitter.com/pNTzk9Xx3f
— Vishal (@justvishall) April 24, 2025