కోస్తాంధ్ర లో కనివిని ఎరుగని రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. కేవలం ఆంధ్ర ప్రాంతం నుండే ఈ సినిమా 70 కోట్ల రూపాయిల ఆఫర్స్ వచ్చాయట. ఇప్పటి వరకు బాహుబలి 2 , పుష్ప 2 , #RRR చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ బిజినెస్ జరిగింది. చాలా కాలం నుండి వాయిదా పడుతూ వస్తున్న సినిమా, దీనికి బిజినెస్ ఎలా జరుగుతుందో అని అభిమానులు కాస్త భయపడ్డారు. కానీ సినిమా నుండి విపరీతంగా ఆకర్షించే కంటెంట్ ఇప్పటి వరకు బయటకి రాకపోయినప్పటికీ, కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి ఈ రేంజ్ రేట్స్ పలుకుతున్నాయి. ఇక సీడెడ్ లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ని 23 కోట్ల రూపాయలకు అడుగుతున్నారట. అదే విధంగా నైజాం ప్రాంతంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 138 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది.
అదే విధంగా కర్ణాటక లో 12 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 25 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ 175 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే అవకాశం ఉండగా, హిందీ లో 40 కోట్ల రూపాయలకు అనిల్ తడని కొనుగోలు చేసాడట. పుష్ప 2 చిత్రాన్ని హిందీ లో విడుదల చేసింది కూడా ఆయనే. ఇక తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ కలిపి మరో 15 కోట్లు, మొత్తం మీ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ 230 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే అవకాశం ఉందట. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే కచ్చితంగా 230 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సిందే. సూపర్ హిట్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల నుండే ఆ రేంజ్ వసూళ్లు వస్తాయని అభిమానులు బలమైన నమ్మకం తో చెప్తున్నారు.