Homeఎంటర్టైన్మెంట్RRR: మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్తున్న నాటు సాంగ్​.. సినిమాపై పెరిగిపోతున్న అంచనాలు!

RRR: మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్తున్న నాటు సాంగ్​.. సినిమాపై పెరిగిపోతున్న అంచనాలు!

RRR: మెగాపవర్​స్టార్​ రామ్​ చరణ్​, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్​, టీజర్స్​, సాంగ్స్​ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా, తాజాగా, ఈ సినిమా నుంచి నాటు నాటు లిరికల్​ విడుదలైంది. తారక్​, చెర్రిల మధ్య ఈ పాటను చిత్రీకరించారు. ఇందులో ఇద్దరూ మాస్​ స్టెప్పులతో పిచ్చెంకించేశారు.

కాగా, ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషల్లో కలిసి ఏకంగా 15 మిలియన్​ వ్యూస్​ను సొంతం చేసుకుంది. దీంతో పాటు, 1 మిలియన్స్​కి పైగా లైక్స్​ సాధించడం విశేషం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఒలివియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్​గా కనిపించనున్నారు. అయితే మొదటి సారి గా ఇద్దరు స్టార్ హీరోలు ఈ నాటు నాటు పాటకు స్టెప్పులు వెయ్యడంతో సినిమా పై మళ్లీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular