ఎంటర్టైన్మెంట్National Film Awards 2023: ఉత్తమనటులు, నటీమణులు వీళ్లెందుకు కాలేదు? వీరికెందుకు అవార్డులు రాలేదు?

National Film Awards 2023: ఉత్తమనటులు, నటీమణులు వీళ్లెందుకు కాలేదు? వీరికెందుకు అవార్డులు రాలేదు?

National Film Awards 2023: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సినీ జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్తమ నటీమణులుగా ఆలియాభట్, కృతిసనన్ లు ఎంపికయ్యారు. ఈ తరుణంలో వీరికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఇంతకంటే అద్భుతమైన సినిమాల గురించి ఎందుకు పట్టించుకోలేదని చర్చలు పెడుతున్నారు. అలాగే తెలుగులోనూ పుష్ప వచ్చిన సమయంలో మరికొన్ని సినిమాలు వచ్చినా వాటికి కనీసం ఒక్క అవార్డు కూడా ఎందుకు ఇవ్వలేదని అంటున్నారు. ఇంతకీ ఏ యే సినిమాలు అవార్డు తీసుకునే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారంటే?

ఉత్తమ చిత్రంగా మాధవన్ హీరోగా నటించిన ‘రాకెట్రీ’ ని ఎంపిక చేశారు. అయితే ఇది మంచి పరిణామామే. కానీ ఈ మూవీ కొన్ని వర్గాలను మాత్రమే ఆకట్టుకుంది. ఇదే సమయంలో అడవుల్లో బతికే వారి నేపథ్యంలో తీసిన ‘జై భీమ్’ సినిమా థియేటర్లకు రాకముందే ప్రతి ప్రేక్షకుడు సినిమాను చూశారు. దీంతో పాటు గరుడ గమన వృషభ వాహన, జనగణమన, సర్పట్టా, గ్రేట్ ఇండియన్ కిచెన్, కర్ణన్ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందాయి. అయినా వీటికి ఏ కేటగిరీలో అవార్డు రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు రావడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తమ శక్తికి మించి నటించారు. జై భీమ్ లోని హీరో మణికందన్ గిరిజన యువకుడిగా పాత్రలో లీనమై పోయారు. వీరు కనీసం పోటీలో ఉన్నారన్న విషయం వినిపించలేదు. ఇలాంటి వారు అవార్డులకు పోటీ పడరా? అని సోషల్ మీడియాలో ఆసక్తి చర్చ సాగుతోంది. ఇక ఉత్తమ నటిగా ఆలియా భట్ (గంగుబాయి కాటియావాడి), కృతి సనన్ (మిమి)లను ఉత్తమ నటీమణులగా ఎంపిక చేశారు. అయితే జై భీమ్ లో హీరోయిన్ గా నటించిన లిజోమోల్ జోస్, గ్రేట్ ఇండియా కిచెన్ లో హీరోయిన్ గా నటించిన నిమిషా సాజయన్ ఇంకా బాగా నటించారు. వీరిని ఎంపిక చేస్తే బాగుండు అన్న ప్రచారం సాగుతోంది.

ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో సంజయ్ లీలా భన్సాలీ అవార్డును గెలచుకున్నాడు. కానీ ‘మానాడు’ అనే సినిమా ఎడిటింగ్ మరింత ఆకట్టుకుంటుందన్న ప్రచారం సాగుతోంది. సంగీతలో దేవి శ్రీ ప్రసాద్ కు అవార్డు రావడం ప్రశంసనీయం.ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిత్రాంభళం పాటు ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ఏదీ ఏమైనా జాతీయ అవార్డుల విషయంలో కొన్ని సినిమాలను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Allu Arjun : అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రాకపోవడానికి కారణం ఇదే…

సినిమా ఇండస్ట్రీలో తమ సేవలను అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం వాళ్లకి జాతీయ పురస్కారాలను అందించి వాళ్ళను గౌరవిస్తుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా 72వ జాతీయ పురస్కారాలను ప్రకటించింది. అందులో...

Deepika Padukone : ‘రాకా’ లో దీపికా పదుకొనే సాహసం.. దేశంలో ఏ హీరోయిన్ కూడా ఇలా చేసి ఉండరు..

Deepika Padukone : మన ఇండియా లో హీరోయిన్స్ క్యాటగిరీలో , బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్స్ జాబితా తీస్తే , అందులో కచ్చితంగా దీపికా పదుకొనే పేరు ఉంటుంది. చూపులు తిప్పుకోలేని...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version