Annamayya: ‘అన్నమయ్య’లో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పాత్ర ఎంత కీలకమో.. శ్రీవారి పాత్ర కూడా అంతే ముఖ్యం గా ఉంటుంది. అన్నమయ్యను వేంకటేశ్వరుడే సృష్టించి తన కోసం పాటలు పాడే విధంగా మలుచుకున్నాడు అని సినిమాలో చూపించారు.

Written By: Chai Muchhata, Updated On : August 29, 2023 5:05 pm

Annamayya

Follow us on

Annamayya: తిరుమల తిరుపతి శ్రీవారు కలియుగ దైవంగా కొనసాగుతున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా వెంకన్న దర్శనానికి తరలివస్తుంటారు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ విషయాన్ని పసిగట్టిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెంకటేశ్వరునికి గానం అంటే చాలా ఇష్టమని, ఆయన మనసును ఉల్లాస పరిచే పాటలు రాసిన అన్నమయ్య గురించి భక్తులకు తెలపాలని అనుకున్నాడు. ఈ తరుణంలో ఆయన 1997లో ‘అన్నమయ్య’ పేరుతో చిత్రాన్ని తీసి వెండితెరపై ఉంచాడు. ఆ సమయంలో అన్నమయ్య అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ఇందులో ఉండే పాటలు సంగీత ప్రియులను విపరీతంగా ఇంప్రెస్ చేసింది. అన్నమయ్య పాత్రలో నాగార్జున నటించారు. వెంకటేశ్వరుని పాత్రలో సుమన్ నటించారు. అయితే అంతకుముందు శ్రీవారి పాత్రలో మరో ఇద్దరు హీరోలను అనుకున్నారట. వారెవరో తెలుసా?

అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పాత్ర ఎంత కీలకమో.. శ్రీవారి పాత్ర కూడా అంతే ముఖ్యం గా ఉంటుంది. అన్నమయ్యను వేంకటేశ్వరుడే సృష్టించి తన కోసం పాటలు పాడే విధంగా మలుచుకున్నాడు అని సినిమాలో చూపించారు. ఈ సినిమా డైరెక్షన్ అద్భుతంగా ఉంటుంది. బిగినింగ్ నుంచి చివరి వరకు పద్ధతిగా సాగుతుంది. ఈ సినిమాలో అన్నమయ్య పాత్రలో నాగార్జున నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఆయన మరదళ్లుగా రమ్యకృష్ణ, కస్తూరిలు నటించారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, సుత్తివేలు తదితరులు నటించి ఆకట్టుకున్నారు.

శ్రీ వేంకటేశ్వరుని పాత్రలో సుమన్ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక దశలో శ్రీవేంకటేశ్వరుడు ఇలాగే ఉంటాడు కావొచ్చన్న విధంగా సుమన్ నటన ఆకట్టుకుంటుంది. సుమన్ పక్కన భానుప్రియ పద్మావతి అమ్మవారి పాత్రలో చక్కగా నటించింది. ఈ సినిమాలో సుమన్ తో పాటు భానుప్రియ తన మాటలతో ఆకట్టుకుంటుంది. అయితే శ్రీవెంకటేశ్వరుని పాత్ర కోసం డైరెక్టర్ రాఘవేంద్రరావు అంతకుముందు ఇద్దరు హీరోలను సంప్రదించాడట.

ముందుగా ఈ పాత్ర కోసం శోభన్ బాబు ను కలిశాడట. తనకు స్టోరీని వివరించి ఈ పాత్రను చేయాలని అడిగారట. అయితే శోభన్ బాబు అప్పటికే సినిమాలు మానేశారు. అంతేకాకుండా ఆయన హీరోగానే నటించి మానేస్తానని అంతకుముందే శపథం చేశారు. దీంతో ఆయన ఈ పాత్ర చేయడం ఇష్టపడలేదట. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఆ కాలంలోనే రూ.50 లక్షల పారితోషికం అడిగారట. దీంతో రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు.

ఆ తరువాత ఇదే పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ ను కలిసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వరుని పాదాలు అన్నమయ్య మొక్కాల్సి ఉంటుంది. అయితే బాలకృష్ణతో దాదాపు సమానమైన నాగార్జున ఈ సీన్ చేస్తే ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయని భావించారట. బాలకృష్ణ తనకు కాల్షీట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో చివరికి బాగా ఆలోచించి సుమన్ ను ఎంపిక చేశారట. సుమన్ ఈ పాత్రకు ప్రాణం పోశారని చెప్పవచ్చు.