Natho Nenu Movie: బుల్లితెరపై కూడా కామెడీతో ప్రేక్షకులను నవ్వించొచ్చు అని ‘జబర్దస్త్’ షో నిరూపిస్తోంది. కామెడీ చేయడంలో టాలెంట్ ఉంటే చాలు జబర్దస్త్ లో ఛాన్స్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఈ షో లో ఎంట్రీ ఇస్తే చాలు ఆ తరువాత జీవితమే మారిపోతుందన్న భావన చాలా మందిలో ఉంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి జబర్దస్త్ సరైన దాని అని కొనియాడుతుంటారు. ఎందుకంటే గతంలో జబర్దస్త్ లో చేసిన చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్లుగా మారిపోయారు. కొందరు సినిమాల్లో నటిస్తుండగా.. మరికొందరు ఏకంగా సినిమా డైరెక్టర్లుగా మారిపోయారు. వారిలో ఎల్దండి వేణు గురించి అందిరకీ తెలిసిందే. ఆయన తీసిన ‘బలగం’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేణు బాటలోనే ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ గా మారిపోయాడు. తానో సినిమా తీస్తున్నాడు. ఆయన ఎవరంటే?
జబర్దస్త్ ప్రొగ్రామ్ లో ఫేమస్ అయిన అనసూయ, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రేష్మి లు సినిమాల్లో కొనసాగుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఎల్దండి వేణు ఏకంగా ఓ సినిమాకు డైరెక్టర్ గా చేశాడు. డైరెక్టర్ చేయడమే కాకుండా ప్రపంచ వ్యప్తంగా గుర్తింపు పొందాడు. ఇంతటి గుర్తింపు రావడానికి తనకు జబర్దస్త్ సపోర్టు ఉందని వేణు చెప్పాడు. అయితే ఇప్పుడు మరో నటుడు డైరెక్టర్ కావడానికి జబర్దస్త్ అవకాశం ఇచ్చినట్లయింది. అయన ఎవరో కాదు.. శాంతి కుమార్ తూర్లపాటి.
ఇటీవ శాంతికుమార్ తూర్లపాటి కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. మిగతా కమెడియన్లకు తీసిపోని విధంగా తనదైనశైలిలో స్కిట్ చేస్తున్నాడు. ఓ వైపు జబర్దస్త్ లో కొనసాగుతూనే ఈయన ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘నాతో నేను’. అయితే ఇదేదో చిన్న సినిమా అనుకుంటే పొరపాటే. ఇందులో సాయికుమార్ కొడుకు ఆది హీరోగా నటిస్తున్నాడు. ఆయనతో పాటు సాయికుమార్ కుడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుం కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన ‘వయ్యారి రామచిలుక’ అనే సాంగ్ ను ఇటీవల రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా శాంతికుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలు తీయాలన్న కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని, అయితే బబర్దస్త్ షో ఇచ్చిన సపోర్టు తో ఇప్పుడు ఆ కల నెరవేర్చుకుంటున్నానని అన్నారు. ఇందులో సాయికుమార్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కొన్ని సీన్లలో సాయికుమార్ ను చూస్లే కన్నీళ్లు ఆగవని అన్నారు. ఇక ఆది సపోర్టుతోనే నేనీ సినిమా తీయగలుగుతున్నానని శాంతి కుమార్ అన్నారు. త్వరలో మూవీ రిలీజ్ అవుతుందని, ఈ సినిమాను ఆదరించాలని శాంతికుమార్ అన్నారు.