Homeఎంటర్టైన్మెంట్Bigg Boss OTT Telugu Nominations: ఏడోవారంలో 8మంది నామినేట్‌.. అషు వ‌ల్ల అత‌ను బ‌లి.....

Bigg Boss OTT Telugu Nominations: ఏడోవారంలో 8మంది నామినేట్‌.. అషు వ‌ల్ల అత‌ను బ‌లి.. ఇన్ని ట్విస్టులా..

Bigg Boss OTT Telugu Nominations: బిగ్ బాస్ అంటేనే కాంట్ర‌వ‌ర్సీ గొడ‌వ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే ట్యాగ్ లైన్ ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే దీన్ని ఈసారి నాన్ స్టాప్ సీజ‌న్ బాగానే కంటిన్యూ చేస్తోంది. కేవ‌లం కాంట్ర‌వ‌ర్సీలు, గొడ‌వ‌లు, బూతులు, తిట్టుకోవ‌డాలు, కొట్టుకోవ‌డాల లాంటి మీద‌నే ఫోక‌స్ పెడుతూ మ‌రింత రంజుగా ఎపిసోడ్ ల‌ను మారుస్తున్నాడు బిగ్ బాస్‌.

Bigg Boss OTT Telugu Nominations
Bigg Boss OTT Telugu Nominations

కాగా ఇప్ప‌టికే ఆరు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో ముమైత్ ఖాన్‌, స‌ర‌యు, శ్రీ రాపాక‌, తేజ‌స్వి, ఆర్జే చైతు, స్ర‌వంతిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఏడో వారానికి సంబంధించిన నామినేష‌న్స్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఈ సారి నామినేష‌న్స్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్‌. స‌రొక‌త్త‌గా ఇద్ద‌రు జంట‌గా వ‌చ్చి డిబేట్ పెట్టుకోవాల‌ని, అందులో ఒక‌రు ఎలిమినేట్ అయిపోయేలా మాట్లాడుకోవాలంటూ చెప్పాడు.

Also Read: Bigg Boss Telugu OTT: సెలబ్రిటీలతో అలాంటి నీచమైన పని చేస్తున్నావ్.. శివపై రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్..

Bigg Boss OTT Telugu Nominations
Bigg Boss OTT Telugu Nominations

అయితే ఒక‌రిని నామినేట్ చేసేందుకు ఒప్పుకోక‌పోతే ఇద్ద‌రినీ నామినేట్ చేస్తామంటూ రూల్ పెట్టాడు. ఇలా వీరు మాట్లాడుతున్నంత సేపు పై నుంచి వాట‌ర్ ప‌డుతుంద‌ని కూడా చెప్పాడు. కాగా హ‌మీదా, అనిల్ ను జంట‌గా పిల‌వ‌డంతో.. హ‌మీదా కోసం అనిల్ నామినేష‌న్స్ లోకి వెళ్లిపోయాడు. ఇక మహేశ్ విట్టాను సేఫ్ చేస్తూ మిత్రా శర్మ నామినేట్ అయింది.

ఇక అజయ్ కోసం ఆరియానా గ్లోరీ బ‌లైపోయింది. అయితే న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, యాంక‌ర్ శివకు డిబేట్ పెట్ట‌డంతో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు రెచ్చిపోయారు. ఎవ్వ‌రూ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక వీరి త‌ర్వాత వ‌చ్చిన బిందు మాధవి, అఖిల్ కూడా ఇలాగే తిట్టుకున్నారు. ఎవ‌రూ త‌గ్గ‌క‌పోవ‌డంతో వారిద్ద‌రినీ కూడా నామినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్‌. అయితే ఇక్క‌డే ఎవ‌రూ ఊహించ‌ని మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్‌.

Bigg Boss OTT Telugu Nominations
Bigg Boss OTT Telugu Nominations

ఏంటంటే.. కెప్టెన్ గా ఉన్న అషు రెడ్డికి స్పెషల్ పవర్ ఇచ్చి సేఫ్ గా ఉన్న వారిలో ఒక‌రిని నామినేట్ చేయాల‌ని చెప్పాడు. దీంతో ఆమె ఏ మాత్రం ఆలోచించ‌కుండా మహేశ్ విట్టాను నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది. కానీ ఆమెకు అఖిల్, అజయ్ అండ‌గా నిలిచారు. ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేష‌న్స్ లో ఉన్నారు.

Bigg Boss OTT Telugu Nominations
Bigg Boss OTT Telugu Nominations

Also Read:Prashanth Neel- Rajamouli: రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్ర‌శాంత్ నీల్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version