Mad For Each Other show: రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో మొదలైన లవ్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. నిన్న గాక మొన్న మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షోలో గొడవలు బిగ్ బాస్ ని మించే ఉన్నాయి. ఒక జంట మరొక జంట పై నెగెటివ్ కామెంట్స్ చేయడమే కాకుండా, కొట్టుకునే స్థాయి వరకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన తన ప్రవర్తన తో ప్రతీ వారం జడ్జీలతో తిట్టించుకుంటూనే ఉంటాడు. కానీ అతని తీరులో ఎలాంటి మార్పు ఉండదు. గేమ్ లో గెలిస్తే ఒకలా ప్రవర్తిస్తాడు , గెలవకపోతే మరోలా ప్రవర్తిస్తాడు. భారీ సినిమా డైలాగ్స్ కొడుతూ, నా కోపాన్ని తట్టుకోలేరు అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో మీరంతా చూసే ఉంటారు.
యాంకర్ శ్రీముఖి మీరు గేమ్ నుండి అవుట్ అని చెప్పగానే , తన చేతిలో ఉన్న బక్కెట్లను కిందకు విసిరి , కాళ్లతో కొట్టి , వాళ్లకు ఒక రూల్ , మాకు ఒక రూల్ అని అరుచుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అనంతరం ఆయన తన సూట్ కేసు లను కళ్ళతో కొడుతూ, నేను వెళ్ళిపోతా ఈ షో నుండి అని రచ్చ చేయడం, ఆయన సతీమణి నీతూ కంట్రోల్ చేయడం , ఇవన్నీ మీరంతా చూసే ఉంటారు. నటరాజ్ మాస్టర్ లో ఎలాంటి మార్పు లేదు , బిగ్ బాస్ రెండు సీజన్స్ లో వచ్చాడు, బీబీ జోడి లో కూడా పాల్గొన్నాడు. అప్పుడు ఎలా అయితే నోరు చించుకొని అరిచే వాడో , ఇప్పటికీ అలాగే ప్రవరిస్తున్నాడు , జడ్జీలు పదే పదే వారిస్తున్నా కూడా ఆయన కంట్రోల్ అవ్వడం లేదు.
నిన్న ఆయన భాను , జాను జోడిలతో గొడవ పడుతూ కొన్ని బూతులు కూడా మాట్లాడాడని టాక్. అది టెలికాస్ట్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ, చూపిస్తే మాత్రం నటరాజ్ మాస్టర్ పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మ్యాన్షన్ లో టికెట్ టు ఫినాలే గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ లో టాప్ 2 గా నిల్చిన కంటెస్టెంట్స్ మహేష్ సాంద్ర మరియు భాను – జాను జంట. నిన్న ఎలా అయితే నటరాజ్ మాస్టర్ ని ఓడించడానికి జాను – భాను స్కెచ్ వేసారో , నేడు వాళ్ళని ఓడించడానికి నటరాజ్ మాస్టర్ – నీతూ జంట స్కెచ్ వేశారు. దీంతో ఈ రెండు జంటల మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.