Homeఎంటర్టైన్మెంట్Premalu 2: ప్రేమలు సీక్వెల్ కు అంతా రెడీ.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Premalu 2: ప్రేమలు సీక్వెల్ కు అంతా రెడీ.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Premalu 2: తెలుగులో మలయాళ చిత్రాల హవా నడుస్తోంది. కమర్షియల్ చిత్రాలను పట్టించుకోని మన ఆడియన్స్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల విడుదలైన రెండు మలయాళ చిత్రాలు తెలుగులో ఆదరణ పొందాయి. మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ముఖ్యంగా ప్రేమలు యువతను ఊపేసింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగు డబ్ చేసి విడుదల చేశారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. థియేటర్స్ యువకులతో నిండిపోయాయి. ప్రేమలు చిత్ర హక్కులు రాజమౌళి కుమారుడు కార్తికేయ కొన్నాడు. దాంతో రాజమౌళి కూడా ప్రేమలు చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో భాగమయ్యాడు. దీంతో ప్రేమలు చిత్రానికి మంచి ప్రచారం దక్కింది.

దర్శకుడు గిరీష్ ఏ డి తెరకెక్కించిన ఈ చిత్రంలో నస్లీన్ కె గపూర్ హీరోగా నటించాడు. మమిత బైజు హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా మమిత కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. ఈమె సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారారు. ఆమె వీడియోలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. కాగా ప్రేమలు చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.

ప్రేమలు 2 ఒకేసారి తెలుగు, మలయాళ, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రేమలు 2 ప్రకటించడంతో ఆ చిత్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రిలీజ్ టైం కూడా ఫిక్స్ చేశారు. 2025లో ప్రేమలు 2 రిలీజ్ ఉంటుందని పోస్టర్ పై జోడించారు. ప్రేమలు చిత్రంలో పెద్దగా కథ ఉండదు. ఈనాటి యువత ఆలోచన ధోరణిని, లైఫ్ స్టైల్ ని వినోదాత్మకంగా రొమాంటిక్ అంశాలతో తెరకెక్కించారు. ప్రేమలు చిత్రం హీరో యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ కథ అక్కడే నడుస్తుందేమో చూడాలి…

RELATED ARTICLES

Most Popular