Nari Nari Naduma Murari 2 Days Collections: చాలా కాలం తర్వాత హీరో శర్వానంద్(Sharwanand) ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రం తో క్లీన్ సూపర్ హిట్ ని అందుకున్నాడు. ‘సామజవరగమనా’ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న రామ్ అబ్బూరి దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ఇది. ఆ సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయ్యిందో, ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో కామెడీ వర్కౌట్ అయ్యింది. శర్వానంద్, నరేష్ మధ్య వచ్చే కొన్ని హిలేరియస్ సన్నివేశాలు బాగా పేలడంతో ఈ చిత్రం రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మొదటి రోజు అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ విపరీతంగా వ్యాప్తి చెందడంతో అన్ని ప్రాంతాల్లోనూ షోస్ బాగా పెరగడం వల్ల, మంచి కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది. విడుదలై రెండు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి రెండవ రోజున కోటి 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయట. ఓవరాల్ గా ప్రీమియర్ షోస్ తో కలిపి, మొదటి రెండు రోజులకు గానూ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 5 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం నుండి కోటి 20 లక్షలు, సీడెడ్ నుండి 28 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 26 లక్షలు రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
గ్రాస్ వసూళ్లు దాదాపుగా 8 కోట్ల 70 లక్షలు వచ్చినట్టు చెప్తున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల 25 లక్షలకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 5 కోట్ల 46 లక్షలు రాబట్టాలి. ఈరోజు, రేపు వచ్చే కలెక్షన్స్ తో ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోబోతుంది. మొత్తం మీద శర్వానంద్ తన కెరీర్ లో చాలా కాలం తర్వాత ఒక క్లీన్ హిట్ ని అందుకొని మళ్లీ ఫార్మ్ లోకి వచ్చేసాడు. ఈ చిత్రం నుండి ఆయన తన కెరీర్ ని ఎలా మలుచుకుంటాడో చూడాలి.