Naresh Pavitra Lokesh: పవిత్ర లోకేష్ తో బంధం పై నరేష్ హాట్ కామెంట్స్…

నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి నరేష్, పవిత్ర హోటల్లో ప్రైవసీగా ఉన్నప్పుడు మీడియా వాళ్లని తీసుకొచ్చి అక్కడ రచ్చ రచ్చ చేసింది. దాంతో వీళ్ల వ్యవహారం బట్టబయలైంది.

Written By: Gopi, Updated On : January 25, 2024 9:06 am
Follow us on

Naresh Pavitra Lokesh: సినిమా ఇండస్ట్రీలో నరేష్ మంచి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. విజయనిర్మల గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదట హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. ఇక నటుడిగా తను 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఆయన అనుకున్న స్థాయిలో విజయాలు రాకపోవడంతో హీరోగా తన సినీ కెరియర్ సాఫీగా సాగలేక పోయింది. ఇక దానికి తోడు గా మొదటి నుంచి కూడా ఆయన రకరకాల వివాదాల్లో చిక్కుకుంటు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండేవాడు.

దానివల్లే ఆయన కెరియర్ కూడా అంతా సక్సెస్ ఫుల్ గా సాగలేదు. ఇక మొత్తానికైతే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత చాలా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా చాలా మంచి పేరును కూడా సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇక నటుడిగా తనకంటూ ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కూడా వ్యక్తిగత విషయాల వల్ల మాత్రం తను చాలా బ్యాడ్ అవుతున్నాడు. ఇక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చాడు. ఇక తన మూడో భార్య అయిన రమ్య రఘుపతి మాత్రం తనకు విడాకులు ఇవ్వనని కరాకండిగా చెప్పేసింది. ఇక ఇది ఇలా ఉంటే నరేష్ తన సహా నటి అయిన పవిత్ర లోకేష్ తో సన్నిహిత్యంగా ఉంటూన్న విషయం అందరికీ తెలిసిందే.

నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి నరేష్, పవిత్ర హోటల్లో ప్రైవసీగా ఉన్నప్పుడు మీడియా వాళ్లని తీసుకొచ్చి అక్కడ రచ్చ రచ్చ చేసింది. దాంతో వీళ్ల వ్యవహారం బట్టబయలైంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నరేష్ తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ తను మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికి ఎప్పుడు కూడా తనకి సంతోషం లేదని, 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక తోడు కావాలని ఇప్పుడు నాకు పవిత్ర రూపంలో ఒక తోడు దొరికింది అంటూ చెప్పాడు.

అలాగే మేమిద్దరం ఒకరికొకరు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వాళ్లం కాబట్టి మా మధ్య మంచి రిలేషన్ షిప్ కుదిరింది అనే విషయాలను కూడా తెలియజేశాడు. ఇక ఎవరు ఏమనుకున్నా నేను నాకు నచ్చినట్టుగానే బతుకుతాను. ఒకరితో నాకు సంబంధం లేదు అంటూ కరకండిగా చెప్పేశాడు. ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజెన్లు ముగ్గురు భార్యల దగ్గర దొరకని సుఖ సంతోషాలు పవిత్ర దగ్గర ఏం దొరికుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు…