https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలేదు… పవిత్రతో లవ్ స్టోరీ బయటపెట్టిన నరేష్!

నరేష్ తమ లవ్ స్టోరీ వివరిస్తూ... ఓ రోజు నైట్ పవిత్రను డిన్నర్ కి తీసుకెళ్ళాను. మంచి భోజనం చేశాము. అప్పుడు నా మనసులోని మాట బయటపెట్టాను. 'ఐ లవ్ యూ' అని చెప్పేశాను.

Written By:
  • Shiva
  • , Updated On : May 24, 2023 / 07:11 PM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: మళ్ళీ పెళ్లి చిత్ర ప్రమోషన్స్ లో నరేష్-పవిత్ర బీభత్సంగా పాల్గొంటున్నారు. మూవీకి రావాల్సిన దానికంటే ఎక్కువ హైప్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్ళీ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తున్న ఈ జంట పలు వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. ఫైనల్ గా తమ లవ్ స్టోరీ నరేష్ బయటపెట్టాడు. అసలు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు? అప్పుడు ఏం జరిగిందో పిన్ టు పిన్ వివరించారు.

    నరేష్ తమ లవ్ స్టోరీ వివరిస్తూ… ఓ రోజు నైట్ పవిత్రను డిన్నర్ కి తీసుకెళ్ళాను. మంచి భోజనం చేశాము. అప్పుడు నా మనసులోని మాట బయటపెట్టాను. ‘ఐ లవ్ యూ’ అని చెప్పేశాను. పవిత్ర సైలెంట్ అయిపోయింది. నాకు టెన్షన్ మొదలైంది. అయ్యో ఉన్న స్నేహం కూడా పోయినట్లుంది. తొందర పడి చెప్పేశానా? అని మనసులో గుబులు మొదలైంది. అప్పట్లో షూటింగ్ కి హైదరాబాద్ వస్తే పవిత్ర హోటల్ లో ఉండేది. ఆ హోటల్ దగ్గర కారులో దింపేశాను. వెళ్ళేటప్పుడు మీరు సమాధానం చెప్పలేదు? అని మరలా అడిగాను.

    పవిత్ర నా దగ్గరకు వచ్చి ‘కీప్ లవింగ్'(ప్రేమిస్తూ ఉండండి) అని చెప్పింది. నాకు అర్థం కాలేదు. కీప్ లవింగ్ అంటే… మీరు ప్రేమించుకోండి నాకు సంబంధం లేదనా? లేక నాకు కూడా ఇష్టమే అనా?. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పొద్దున్నే షూటింగ్ ఉంది. మార్నింగ్ సెట్స్ కి వెళితే నార్మల్ గా ఉంది. ఎప్పటిలాగే పలకరించింది. లాభం లేదని ఓ కవిత రాశాను. ఓ రోజు ధైర్యం చేసి అందరి ముందే చెయ్యి పట్టుకొని కారవాన్ లోకి తీసుకెళ్ళాను.

    మీకు నేనంటే ఇష్టం ఉందా లేదా? చెప్పండి. ఈ సస్పెన్సులో పెట్టి చంపొద్దని అడిగేశాను. అప్పుడు పవిత్ర ‘ఐ లవ్ యూ’ అన్నారు. అలా మా జర్నీ మొదలైంది, అని నరేష్ క్లుప్తంగా పవిత్ర లోకేష్ తో తన బంధాన్ని వివరించారు. నరేష్ అడిగాక మీరు అంత టైం తీసుకోవడానికి కారణం ఏంటని పవిత్ర లోకేష్ ని అడగ్గా?.. మాది యంగ్ ఏజ్ కాదు. 20 ఏళ్ల వాళ్ళ మధ్య లవ్ స్టోరీ అంటే డిఫరెంట్. ఈ వయసులో మరో బంధం అంటే ఆలోచించాలి కదా… అని సమాధానం చెప్పారు. వీరిద్దరూ కలిసిన నటించిన మళ్ళీ పెళ్లి చిత్రం మే 26న విడుదల కానుంది.