Site icon OkTelugu

Balakrishna vs JR Ntr : ఎన్టీఆర్ జోలికి వస్తే ఊరుకోం బాలయ్య ఫ్యాన్స్ కి వార్నింగ్..!

Balakrishna vs JR Ntr

Balakrishna vs JR Ntr

Jr NTR vs Balaiah : ఫ్యాన్ వార్స్ కొత్తేమీ కాదు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య రగడ జరిగితే అది సెన్సేషన్. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నందమూరి హీరోలు బాలకృష్ణ-ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు. రెండు వర్గాలుగా ఏర్పడి మాటలతో తలపడుతున్నారు. ఒకరిపై మరొకరు దిగజారుడు కామెంట్స్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కామన్ గా బాలయ్య, ఎన్టీఆర్ లను పొగడ్తలతో ముంచెత్తిన నందమూరి ఫ్యాన్స్ వారినే తిడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఇందుకు కారణమయ్యాయి.

మే 20న హైదరాబాద్ వేదికగా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. మెగా హీరో రామ్ చరణ్ పాల్గొని ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో తాతయ్య శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం కుదరదని వివరణ ఇచ్చారు. ఇది నందమూరి అభిమానుల్లో ఒక వర్గానికి కోపం తెప్పించింది. ఎన్టీఆర్ ని దెబ్బతీయాలని ఎదురుచూస్తున్న వాళ్లకు ఆయుధంలా దొరికింది. తాత పేరు పెట్టుకొని ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కి ఆయనతో అవసరం తీరిపోయింది. జీవితం ఇచ్చిన తాతయ్య కోసం ఒక పూట కేటాయించలేక పోయాడని కౌంటర్లు మొదలుపెట్టారు.

గత ఐదు రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మీద దాడి జరుగుతుంది. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ఇదంతా కావాలనే ఓ వర్గం చేయిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ టార్గెట్ గా ఈ చర్యలకు కొందరు ప్రణాళికలు వేశారంటున్నారు. టీడీపీ, బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ మీద సోషల్ మీడియా దాడికి దిగారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. మా ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తారా? ఇక చూస్తూ ఊరుకోము అంటూ ఎదురు దాడికి దిగారు.

టీడీపీ అయినా బాలయ్య అయినా మా ఎన్టీఆర్ జోలికి రానంత వరకే… అంటూ సవాళ్లు విసురుతున్నారు. గతంలో మెగా, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కలిసి దాడి చేసిన నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలి కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. పొలిటికల్ ఆరోపణల నుండి సినిమా రికార్డ్స్ బయటకు తీస్తూ పరస్పరం దూషించుకుంటున్నారు.

Exit mobile version