Naresh Pavithra bedroom: మన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిల్చిన జంట ఏదైనా ఉందా అంటే అది నరేష్(Naresh), పవిత్ర(Pavitra) జంటనే. వీళ్లిద్దరి వివాహం 2023 వ సంవత్సరం, మార్చి 10 వ తారీఖున జరిగింది. నరేష్ కి నాల్గవ పెళ్లి అవ్వడం తో ఆయనపై సోషల్ మీడియా లో నెగటివిటీ విపరీతంగా ఏర్పడింది. దానికి తోడు నరేష్ మాజీ భార్య రమ్య చేసిన గొడవ గురించి ఇప్పటికీ మనం మరచిపోలేము. బెంగళూరులో నరేష్, పవిత్ర ఉంటున్న ఒక హోటల్ వద్ద దూసుకెళ్లి వాళ్ళను చెప్పులతో కొట్టే ప్రయత్నం చేసింది. ఆరోజుల్లో ఈ ఘటన పెను దుమారం రేపింది. ఇలాంటి ఘటనలు ఒక ఏడాది పాటు రిపీట్ గా జరుగుతూనే ఉండేవి. ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని దారుణంగా తిట్టుకోవడం, ఆరోపణలు చేసుకోవడం వంటివి చేశారు. ఆ తర్వాత సెటిల్మెంట్ అయ్యిందో ఏమో తెలియదు కానీ, మళ్ళీ ఈ వ్యవహారం లో ఎలాంటి వివాదం చోటు చేసుకోలేదు.
Also Read:‘హరి హర వీరమల్లు’ కు నిజాం రాజుకు ఏంటి సంబంధం..? చార్మినార్ కథలో ఎందుకు ఉంది?
నరేష్, పవిత్ర ప్రస్తుతం తమ దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా నడుపుతున్నారు. అయితే రీసెంట్ గానే నరేష్ తన సొంత కష్టార్జీతం తో ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నాడు. నేడు ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన సందర్భంగా టాలీవుడ్ లోని ప్రముఖులందరినీ ప్రత్యేకించి ఆహ్వానించాడు. వచ్చిన ప్రతీ ఒక్కరికి ఇంటిని చూపిస్తూ, వాటిని ప్రత్యేకంగా వర్ణించడం, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సీనియర్ నటుడు మురళీ మోహన్(Murali Mohan) కి తన బెడ్ రూమ్ తో సహా చూపిస్తూ వివరించడం గమనార్హం. సాధారణంగానే నరేష్ పై ఈమధ్య కాలం లో నెగటివిటీ పెళ్లి తర్వాత బాగా పెరిగింది. ఇలా బెడ్ రూమ్ కూడా చూపించడం తో నువ్వు, నీ భార్య పవిత్ర ఉండే బెడ్ రూమ్ అతనికి ఎందుకు చూపిస్తున్నావ్ అంటూ నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ప్రభాస్ పేరు ప్రస్తావించని జెనీలియా..మండిపడుతున్న అభిమానులు!
ఇకపోతే నరేష్ ఇండస్ట్రీ లో ఎంత బిజీ ఆర్టిస్ట్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో గా కంటే కూడా ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎవ్వరూ చూడనంత పీక్ రేంజ్ ని చూశాడు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో కచ్చితంగా నరేష్ ఉండాల్సిందే, కానీ ఈమధ్య కాలం లో నరేష్ సినిమాల సంఖ్య బాగా తగ్గింది. 2023 వ సంవత్సరం వరకు ఏడాదికి కనీసం ఆరు సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన నరేష్, ఇప్పుడు మాత్రం కేవలం రెండు మూడు సినిమాలతో సరిపెడుతున్నాడు. గత ఏడాది కేవలం రెండు సినిమాల్లో నటించిన నరేష్, ఈ ఏడాది ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘జాక్’ వంటి చిత్రాల్లో మాత్రమే కనిపించాడు. కారణం ఏంటో తెలియదు కానీ, నరేష్ ని మాత్రం ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నారు.