Sudigali Sudheer Remuneration: సుడిగాలి సుధీర్ ఒక్కో సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..? రేంజ్ బాగా మారిపోయిందిగా!

ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిట్లో సుడిగాలి సుధీర్ ఉండాల్సిందే. ఆయన లేకపోతే ఈటీవీ లో కామెడీ షోస్ అనేవే లేవు అనే స్థాయికి ఎదిగి, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం లో బుల్లితెర పవర్ స్టార్ అని అనిపించుకున్నాడు. అంతటి క్రేజ్ మరియు పాపులారిటీ ని దక్కించుకున్న ఈయనకి సినిమాల్లో హీరో గా చేసే అవకాశం దక్కింది.

Written By: Vicky, Updated On : May 31, 2023 5:53 pm

Sudigali Sudheer

Follow us on

Sudigali Sudheer Remuneration: మ్యాజిక్ షోస్ చేసుకుంటూ పొట్ట నింపుకునే సుడిగాలి సుధీర్ కి జబర్దస్త్ షో లో అవకాశం రావడం, ‘వేణు వండర్స్’ టీం లో ఒక కమెడియన్ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత అతనిలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ ని గుర్తించి మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ టీం లీడర్ ని చేసింది. తనకి వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని, కేవలం జబర్దస్త్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు సుడిగాలి సుధీర్.

ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిట్లో సుడిగాలి సుధీర్ ఉండాల్సిందే. ఆయన లేకపోతే ఈటీవీ లో కామెడీ షోస్ అనేవే లేవు అనే స్థాయికి ఎదిగి, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం లో బుల్లితెర పవర్ స్టార్ అని అనిపించుకున్నాడు. అంతటి క్రేజ్ మరియు పాపులారిటీ ని దక్కించుకున్న ఈయనకి సినిమాల్లో హీరో గా చేసే అవకాశం దక్కింది.

హీరో గా చేసే ముందు కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు కానీ, బుల్లితెర మీద వచ్చినంత పేరు ప్రఖ్యాతలలో సగం కూడా వెండితెర మీద రాలేదు. మొదటి సినిమా యావరేజి గా ఆడింది, రెండవ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ మూడవ సినిమా ‘గాలోడు’ మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రాకపోయినప్పటికీ డివైడ్ టాక్ మీదనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిందంటే సుడిగాలి సుధీర్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

దీనితో ఆయన హీరో గా చేస్తున్న సినిమాలకు ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయలకు తక్కువ డిమాండ్ చెయ్యడం లేదట. ప్రస్తుతం ఆయన గోట్ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. తమిళం లో రీసెంట్ టైం లో సెన్సేషన్ గా మారిన యంగ్ హీరోయిన్ దివ్య భారతి ఇందులో సుధీర్ సరసన నటిస్తుంది.