https://oktelugu.com/

CM KCR: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?

CM KCR: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాలపై సైతం కేసీఆర్ దృష్టిసారించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీతో సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పెట్టారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2022 / 10:00 AM IST
    Follow us on

    CM KCR: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాలపై సైతం కేసీఆర్ దృష్టిసారించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది.

    KCR

    ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీతో సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పెట్టారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి రైతుల్లో సానుభూతిని పొందారు.

    కేసీఆర్ రైతు పక్షపాతి అని మోదీ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి తెలంగాణలో విజయవంతమయ్యారు. ఆ తర్వాత నుంచి వరుసగా బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీని ఏకిపారేశారు.

    బీజేపీని కూకటి వేళ్లతో పెకలించి వేస్తాననే ధోరణిలో సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. దీనంతటి వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరిగా సీఎం కేసీఆర్ ఈసారి సెంటిమెంట్ ను కాకుండా పీకే వ్యూహాలను నమ్ముకున్నారని సమచారం.

    పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ బీజేపీపై అనుసరించిన విధానాలనే సీఎం కేసీఆర్ తెలంగాణలోనూ అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బెంగాల్లో మమత బెనర్జీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ ఆమెపై వేధింపులకు దిగడంతో ప్రజల్లో ఆమెకు సానుభూతి పెరిగింది. ఈ కారణంతోనే ఆమె మూడోసారి అధికారంలోకి వచ్చారు.

    తెలంగాణలోనూ బీజేపీ కేసీఆర్ తో కయ్యానికి దిగుతోంది. ఆయనకు కావాల్సింది కూడా ఇదే. దీంతోనే ఆయన ఇటీవల గవర్నర్ పాల్గొన్న రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. గవర్నర్ ద్వారా బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడాలని ఆయన కోరుకుంటున్నారు. తద్వారా బీజేపీపై వ్యతిరేకతోపాటు తనపై సానుభూతి రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

    అందుకే ఇటీవల ఆయన ఓ రేంజులో బీజేపీని ఓ ఆట ఆడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై రెచ్చిపోతే అది తమకే లాభమని కేసీఆర్ భావిస్తున్నారట. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కొనే స్థాయిలో బీజేపీ లేకపోయినా ఆయన ఆపార్టీని టార్గెట్ చేయడం వెనుక ఇదే కారణమని తెలుస్తోంది.

    For LIVE News, National Updates, India News Watch: