Homeఎంటర్టైన్మెంట్Narakasura Movie Teaser Review: నరకాసుర టీజర్ రివ్యూ: భయంకరమైన రాక్షసుడు జననం... ఈ శివుడు...

Narakasura Movie Teaser Review: నరకాసుర టీజర్ రివ్యూ: భయంకరమైన రాక్షసుడు జననం… ఈ శివుడు లక్ష్యం ఏమిటీ!

Narakasura Movie Teaser Review: డిఫరెంట్ సబ్జక్ట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. అలాగే విలేజ్ డ్రామాలు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. కాంతార, దసరా, విరూపాక్ష ఈ కోవకు చెందిన చిత్రాలే. పల్లె వాసనలతో కూడిన థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడిదే ట్రెండ్. అందుకే మేకర్స్ అలాంటి సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. తాజాగా నరకాసుర టైటిల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది.

రక్షిత్ అల్లూరి హీరోగా నటించిన నరకాసుర మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ విడుదల చేశారు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచింది. రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పుష్ప ఫేమ్ శత్రు కీలక రోల్ చేశారు. ఆయన గెటప్ పూర్తి భిన్నంగా ఉంది. స్వామిలా ఆయన ఉన్నారు.

హీరో పాత్ర చాలా వైల్డ్ అండ్ రూత్ లెస్ గా డిజైన్ చేశారు. టీజర్ లో కొన్ని విజువల్స్ అబ్బురపరిచాయి. ఇది జాతి వైరానికి, కుల మత బేధాలకు, భూమి హక్కుకు సంబంధించిన సబ్జెక్టు కావచ్చు. హింసపాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హీరో రక్షిత్, శత్రు మధ్య ఆధిపత్యపోరు మూవీలో హైలెట్ అయ్యే సూచనలు కలవు. అపర్ణ జనార్దన్, సంగీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించారు.

నరకాసుర చిత్రానికి సెబాస్టియన్ నోహ దర్శకత్వం వహించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయన సమకూర్చారు. సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్ నిర్మిస్తున్నారు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మాతగా ఉన్నారు. నవఫల్ రాజా సంగీతం అందించారు. సీనియర్ నటుడు చరణ్ రాజ్ కీలక రోల్ చేయడం విశేషం. చాలా కాలం తర్వాత ఆయన తెలుగులో నటిస్తున్నారు.

 

Narakasura Official Teaser Telugu | Rakshit Atluri | Sebastian | Sumukha Creations | Ideal Filmmaker

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version