Nara Rohit Wife In OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). సుజిత్(Sujith) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీ అవ్వడం వల్ల కొంతకాలం వరకు షూటింగ్ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ముంబై లో కొద్దిరోజుల నుండి షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతుంది. నిన్నటి షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ కి తీవ్రమైన అస్వస్థత రావడం తో వెంటనే ఆయన్ని హాస్పిటల్ లో చేర్పించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఈలోపు ఇమ్రాన్ హష్మీ తో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
జూన్ 10 లోపు ఎట్టి పరిస్థితి లోనూ షూటింగ్ ని పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడట. ఆ తర్వాత ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే గత కొద్దిరోజులుగా ఈ చిత్రం లో ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్ సతీమణి శిరీష ఓజీ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనే వార్త సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవుతుంది. దీనిపై నారా రోహిత్ రీసెంట్ గా జరిగిన ‘భైరవం’ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. ఈ నెల 30 వ తారీఖున ‘భైరవం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రంలో హీరోలుగా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) కలిసి సాయి ధరమ్ తేజ్ తో సరదాగా ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ నారా రోహిత్ తో మాట్లాడుతూ ‘మీ సతీమణి ఓజీ చిత్రం లో నటిస్తుందని అందరూ అంటూ ఉన్నారు. మాకు ఏమైనా అప్డేట్ ఇవ్వొచ్చు కదా దాని గురించి’ అని అడగ్గా, దానికి నారా రోహిత్ సమాధానం చెప్తూ ‘అవును..అది నిజమే..శిరీష ఓజీ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది’ అంటూ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుండి ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఈ సినిమాలో నటించినందుకు ఆమె ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట.శిరీష నారా రోహిత్ తో పెళ్లికి ముందు కూడా ఒక నటినే, కానీ సక్సెస్ చూడలేకపోయింది. ఈమె నారా రోహిత్ తో కలిసి ఒక సినిమా కూడా చేసింది. చూసేందుకు హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం, కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. కెరీర్ పరంగా అదృష్టం కలిసిరాక పోయినా, నారా కుటుంబం లో భాగస్వామ్యం అవ్వడం ఆమె చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.