https://oktelugu.com/

పీరియాడికల్ కథలు చిన్నాచితకా హీరోలకెలా ?

పీరియాడికల్ కథతో సినిమా చేయాలంటే చాలా కష్టం. అన్నిటికి మించి అప్పటి లోకానికి ప్రేక్షకుడిని తీసుకువెళ్లాలి. పైగా క్యాస్టూమ్స్ విషయంలో కూడా ఎన్నో ఉంటాయి. ఇవ్వన్నీ చేసినా సినిమా హిట్ అవుతుంది అని గ్యారింటీ లేదు. అందుకే పీరియాడిక్ అనగానే నిర్మాతలు త్వరగా ముందుకు రారు. స్టార్ హీరోలు ముచ్చట పడితే గానీ, రంగస్థలం లాంటి సినిమా రాదు. నిర్మాతల కష్టాలు తెలిసినా కొంతమంది స్టార్స్ మాత్రం పీరియాడిక్ కథల పై ఆసక్తి చూపిస్తున్నారు. శ్యామ్ సింఘ […]

Written By:
  • admin
  • , Updated On : July 22, 2021 / 02:23 PM IST
    Follow us on

    పీరియాడికల్ కథతో సినిమా చేయాలంటే చాలా కష్టం. అన్నిటికి మించి అప్పటి లోకానికి ప్రేక్షకుడిని తీసుకువెళ్లాలి. పైగా క్యాస్టూమ్స్ విషయంలో కూడా ఎన్నో ఉంటాయి. ఇవ్వన్నీ చేసినా సినిమా హిట్ అవుతుంది అని గ్యారింటీ లేదు. అందుకే పీరియాడిక్ అనగానే నిర్మాతలు త్వరగా ముందుకు రారు. స్టార్ హీరోలు ముచ్చట పడితే గానీ, రంగస్థలం లాంటి సినిమా రాదు.

    నిర్మాతల కష్టాలు తెలిసినా కొంతమంది స్టార్స్ మాత్రం పీరియాడిక్ కథల పై ఆసక్తి చూపిస్తున్నారు. శ్యామ్ సింఘ రాయ్, రాధేశ్యామ్,ఆర్ఆర్ఆర్, సలార్, కొరటాల – ఎన్టీఆర్ సినిమా ఇలా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అయితే, ప్రభాస్ రాథేశ్యామ్ కోసం వింటేజ్ ఇటలీని రీ క్రియేట్ చేసి షూట్ చేశారు. ప్రభాస్ కి అంటే నేషనల్ మార్కెట్ ఉంది.

    ఎన్టీఆర్ సినిమాకి కూడా మార్కెట్ వర్కౌట్ అవుతుంది. కానీ హీరో నాని ‘శ్యామ్ సింఘ రాయ్’ పరిస్థితి ఏమిటి ? నానికి బాగానే మార్కెట్ ఉంది, కాకపోతే స్టార్ హీరో మార్కెట్ లేదు, పైగా నాని పక్కా లోకల్ మాత్రమే. అయినా శ్యామ్ సింఘ రాయ్ కోసం నిర్మాత భారీ ఖర్చు పెట్టి సెట్స్ వేసి సినిమా పూర్తి చేశాడు. అయినా సినిమాలో కొన్ని ఇంకా రీషూట్ చేయాల్సిన అవసరం రావడంతో నిర్మాత టెన్షన్ పడుతున్నాడు.

    ఇప్పుడు ఆ రీషూట్స్ కోసం కూడా మళ్ళీ సెట్స్ వేయాలంటే ఏమి చేయాలి అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. వేయాల్సిన సెట్ లో ముఖ్యమైనది ఒకప్పటి కలకత్తా సిటీ. అంత పెద్ద నగరాన్ని చూపించాలంటే.. బాగా ఖర్చు అవుతుంది. గతంలో కూడా ఆరున్నర కోట్లతో భారీ ఓల్డ్ కలకత్తా సెట్ ను తయారు చేసారట. ఇప్పుడు ప్యాచ్ వర్క్ కి కూడా అంత ఖర్చు పెట్టాలంటే కచ్చితంగా వర్కౌట్ కాదు. మరి ఏమి జరుగుగుతుందో చూడాలి.