ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక సంస్థకు ఇలా బ్రాండ్ రావడం అంటే గొప్ప విషయమే. అందుకే, స్టార్ హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తోంది మైత్రీ మూవీస్. ఈ క్రమంలోనే కొత్తగా ముగ్గురు హీరోలతో కొత్త సినిమాలు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అక్కినేని అఖిల్, శ్రీవిష్ణు, గోపీచంద్ లకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చిందట.
నిజానికి అఖిల్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తోంది. అఖిల్ సినిమా కోసమే డైరెక్టర్ అజయ్ భూపతిని సెట్ చేయాలనుకున్నారు. కానీ, అజయ్ చెప్పిన కథ అఖిల్ కి నచ్చలేదు. దాంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే, ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథ అఖిల్ బాగా నచ్చింది.
ఓ బాయ్ నెక్ట్స్ డోర్ టైపు మాంచి లైన్ ను చెప్పిన ఆ కొత్త దర్శకుడికే మైత్రీ అవకాశం ఇచ్చింది. అయితే ప్రస్తుతం అఖిల్ చేతిలో బ్యాచులర్, సురేందర్ రెడ్డి సినిమాలు వున్నాయి. ఇక గోపీచంద్ తో తీసే సినిమాకి దర్శకుడు అజయ్ భూపతి డైరెక్టర్. శ్రీవిష్ణు సినిమాకి కూడా దర్శకుడు కొత్త డైరెక్టరే.