Nani: టాలీవుడ్ స్టార్స్ గల్లీ హీరోలా ? కాంట్రవర్సీ కి తెరలేపిన నాని

తాజాగా మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న "కింగ్ అఫ్ కోట " ఆగస్టు 24న విడుదల కాబోతుంది. దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Written By: Shiva, Updated On : August 14, 2023 10:19 am

Nani

Follow us on

Nani: నేచురల్ స్టార్ నాని సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా హీరోగా ఎదిగి తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్న నటుడు. ఒక చిరంజీవి, రవితేజ మాదిరి నాని స్వశక్తితో ఎదిగాడు. కానీ అప్పుడప్పుడు నాని చేసే వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతుంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ గురించి నేపోటిజం గురించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసినవే.

తాజాగా మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న “కింగ్ అఫ్ కోట ” ఆగస్టు 24న విడుదల కాబోతుంది. దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిలుగా దగ్గుబాటి రానా, హీరో నాని వచ్చారు. ఇదే వేదికపై నాని పాన్ ఇండియా స్టార్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

” మనమందరం పాన్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు ఎందుకో పాన్ ఇండియా అనే పదం నచ్చదు. నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. అతని కోసం హిందీ డైరెక్టర్ స్టోరీ రాసుకుంటారు. తెలుగు డైరెక్టర్ స్టోరీ రాస్తాడు. ఓ తమిళ దర్శకుడు, ఓ మలయాళ దర్శకుడు అతని కోసం స్టోరీ లు రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ కి నిజమైన నిర్వచనం అంటే ఇదే ” అంటూ నాని మాట్లాడటం జరిగింది.

దీంతో టాలీవుడ్ లోని మిగతా హీరోల ఫ్యాన్స్ నాని ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నాని ఎప్పటికి పాన్ ఇండియా స్థాయికి చేరుకోలేదు కాబట్టి తనకు ఆ పదం నచ్చదు అని అన్నాడు. దుల్కర్ మంచి నటుడే కావచ్చు, పాన్ ఇండియా స్టార్ అయ్యే మెటీరియల్ అతనిలో ఉండవచ్చు . కానీ అతను మాత్రమే నిజమైన పాన్ ఇండియా స్టార్ అనడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్లు.

అసలు పాన్ ఇండియా మార్కెట్ ను సృష్టించి, అక్కడ సింహాసనం వేసుకుంది ప్రభాస్. ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఆ స్థాయికి చేరుకున్నారు. కానీ నాని వ్యాఖ్యలు చూస్తే వీళ్ళందరూ అసలు పాన్ ఇండియా స్టార్స్ కాదు అన్నట్లు ఉన్నాయంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అసలు పాన్ ఇండియా గుర్తింపు ఇవ్వడానికి నాని కి ఉన్నదా అర్హత ఏమిటి. ఇలాంటి అటిట్యూట్ తగ్గించుకొని, నోటి దూల వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.