https://oktelugu.com/

నాని ‘వి’ మూవీ సెన్సార్ రిపోర్ట్‌

నేచురల్‌ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వి’ విడుదలకు ఒక్కో అడ్డు తొలగిపోతోంది. మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లు మూత పడడంతో ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్‌ చేస్తున్నారు. నిర్మాత దిల్‌ రాజు దాదాపు రూ. 30 కోట్లు ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌కు విక్రయించాడని సమాచారం. శాటిలైట్‌ రైట్స్‌ కూడా కలుపుకుంటే మంచి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 23, 2020 / 07:19 PM IST
    Follow us on


    నేచురల్‌ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వి’ విడుదలకు ఒక్కో అడ్డు తొలగిపోతోంది. మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లు మూత పడడంతో ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్‌ చేస్తున్నారు. నిర్మాత దిల్‌ రాజు దాదాపు రూ. 30 కోట్లు ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌కు విక్రయించాడని సమాచారం. శాటిలైట్‌ రైట్స్‌ కూడా కలుపుకుంటే మంచి లాభం కూడా వచ్చిందట.

    Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

    తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఇంద్రగంటితో నానికి ఇది మూడో చిత్రం. అష్టాచమ్మ, జెంటిల్‌మెన్‌ ఘన విజయాలు సాధించగా ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం. పైగా, ఇందులో అతను ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషించడంతో చిత్రంపై ఆసక్తి రెట్టింపైంది. వేసవిలోనే విడుదల కావాల్సినా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. థియేటర్లలోనే విడుదల చేద్దామని నాని పట్టుబట్టినా ఈ పరిస్థితుల్లో అది కుదరని పని అని చెప్పిన దిల్‌ రాజు డిజిటల్‌ రిలీజ్‌కు అతడిని ఒప్పించాడు. దాంతో, ఇప్పటికే ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్‌ చేశాడు నాని. థియేటర్లు మూతపడితేనేం.. ఇల్లునే థియేటర్గా మార్చుకుందాం అనే థీమ్‌తో ప్రసారం అవుతున్న ప్రమోషన్‌ యాడ్‌ మిగతా చిత్రాలకు సైతం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక, ఈ మూవీకి సంబంధించి తాజా కబురు వచ్చింది.‘వి’ సినిమా సెన్సార్ పనులను దర్శకుడు మోహన కృష్ణ పూర్తి చేసుకున్నాడు. దీనికి సెన్సార్ బోర్డు పెద్దగా కట్లు లేకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.

    Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

    ఈ చిత్రంలో నానికి జంటగా అదితి రావు హైదరి, సుధీర్ బాబుకు జంటగా నివేథా థామస్‌ నటించారు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక, ఈ మూవీ కథ లీక్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్‌ చేస్తోంది. తన భార్య అదితి రావును హత్య చేసిన వాళ్లను వరుసపెట్టి చంపేసే కిల్లర్గా నాని కనిపిస్తాడట. ప్రతి మర్డర్ దగ్గర అతను వి అనే మార్కు వదిలేస్తాడని, ఆ మిస్టరీ కిల్లర్ కోసం వెతికే పోలీస్‌ ఆఫీస్‌ పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తాడని అంటున్నారు. అనేక ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమాగా ఉంది. మరి, నాని, ఇంద్రగంటి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారో లేదో ఇంకో రెండు వారాల్లో తేలుతుంది.